టాలీవుడ్ లో అగ్రిమెంట్లు, సంతకాలు, నిబంధనలు అన్నీ వుంటాయి. కానీ వీటిని మించి ఓ మాట, కట్టుబాటు, పద్దతులు కూడా వుంటాయి. అందుకే ఇక్కడ అగ్రిమెంట్ ల కన్నా మాటలకే ఎక్కువ విలువ వుంటుంది. దానికి కట్టుబడతారు కూడా.
సినిమా అమ్మేటపుడు ఇంత రికవరీ ఇస్తాం, మాదీ పూచీ అంటే ఆ మాట మీద వుంటారు. అలాగే అగ్రిమెంట్లు వున్నా, నష్టపోయాం అని డిస్ట్రిబ్యూటర్లు అంటే నిర్మాత కాస్తయినా ఆదుకోవడం పరిపాటి. లేదా తరువాత సినిమాలో అయినా ముందు వెనుక చూస్తారు.
కానీ ఆ మధ్య విడుదలయిన ఓ చిన్న సినిమా విషయంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు కాస్త ఇబ్బందిగానే వుందని. ఆ చిన్న సినిమా నిర్మాతకు కాస్త గట్టి పలుకుబడి వుండడంతో, డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా కాదు కనీసం అడగలేకపోతున్నారు. నిర్మాత దగ్గర వాళ్లకు చెప్పుకుని 'మము బ్రోవమని చెప్పరే' అంటూ ప్రాధేయపడుతున్నారట.
తరువాత సినిమాలో చూద్దాం లెండి అని ఆ దగ్గర వాళ్లు సర్ది చెబుతున్నారట. ఇంకేం చేస్తా…ఒక్కో సినిమాలో వస్తుంది ఒక్కో సినిమాలో పోతుంది అని నచ్చ చెప్పుకుంటున్నారు వారిలో వారే.