మేనిఫెస్టో మాట ఎత్తే అర్హత చంద్రబాబుకు ఉందా?

తెలుగుదేశం పార్టీ సరికొత్తగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రమంతా ఇల్లిల్లూ తిరిగి ప్రజల సమస్యలను క్రోడీకరించి ఒక భారీ మ్యానిఫెస్టో తయారు చేస్తాం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో 55 లక్షల ఇళ్లకు…

తెలుగుదేశం పార్టీ సరికొత్తగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రమంతా ఇల్లిల్లూ తిరిగి ప్రజల సమస్యలను క్రోడీకరించి ఒక భారీ మ్యానిఫెస్టో తయారు చేస్తాం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో 55 లక్షల ఇళ్లకు పార్టీ నాయకులు వెళతారు. సమస్యలు తెలుసుకుంటారు. అవన్నీ మేనిఫెస్టోలోకి వస్తాయని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇలా సమస్యల సేకరణ కార్యక్రమానికి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అని నామకరణం చేశారు.

ఇంతవరకు అధికారిక ప్రకటన! వాస్తవంలోకి వచ్చి ఈ పరిణామాన్ని విశ్లేషించినప్పుడు.. మ్యానిఫెస్టో అనే పదం ఎత్తే అర్హత తెలుగుదేశం పార్టీకి ఉన్నదా? అనే అనుమానం ప్రజలలో కలుగుతోంది. ప్రజలకు ఇచ్చే ప్రమాణ పత్రం లాంటి మేనిఫెస్టోను చరిత్రలో ఎన్నడైనా చంద్రబాబు నాయుడు గాని తెలుగుదేశం పార్టీ గాని గౌరవించిన దాఖలాలు ఉన్నాయా అనేది ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. 

తెలుగుదేశం పార్టీ నాయకులు సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే కేవలం 55 లక్షల ఇళ్లకు మాత్రమే ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నారు? మిగిలిన ఇళ్ళలో ఉన్నవాళ్లు రాష్ట్రంలోని ప్రజలు కాదా? వారిని కూడా సంప్రదించాలని ఆలోచన వీరికి రాలేదా? అని తర్కించుకున్నప్పుడు వారి సీక్రెట్ ఎజెండా మనకు సులభంగానే అర్థమవుతుంది. సమస్యల గురించి తెలుసుకోవడం అనే ముసుగులో.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే పేరు మీద ఒక ప్రహసనం నడిపిస్తున్నారు. ఈ ముసుగులో తెలుగుదేశం నాయకుల ఇళ్ళకు మాత్రం వెళ్లి వారు చెప్పే చెత్త మొత్తం రికార్డు చేసి అదే ప్రజల సమస్యలుగా ప్రచారంలోకి తెస్తారనేది ఊహించవచ్చు. ఈ కార్యక్రమంలో తేలే సమస్యలతోనే మా మేనిఫెస్టో ఉంటుందని చంద్రబాబు నాయుడు అంటున్నారు.

అసలు మేనిఫెస్టో అనే పదం మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అనేది ప్రజల సందేహం. ప్రజలను మభ్యపెట్టడానికి మ్యానిఫెస్టోలో రకరకాల వందల హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టో తొలగించేసే, రిమూవ్ చేసే నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు. అధికారం దక్కిన తర్వాత ప్రజలు తమ మేనిఫెస్టోను చూస్తే, తాము చేస్తున్న పనులను ఛీత్కరించుకుంటారని ఆయనకు భయం. 

జగన్మోహన్ రెడ్డి తీరు అది కాదు. అత్యంత చిన్నదైన, సరళమైన మేనిఫెస్టోలోనే రాష్ట్ర అభ్యున్నతికి ఎన్ని అద్భుతాలు చేయవచ్చునో వాటన్నింటినీ హామీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోలో 96% హామీలను నెరవేర్చాం అంటూ పదేపదే ప్రకటించగల గుండె ధైర్యం ఆయన సొంతం. ఎందుకంటే మేనిఫెస్టోను పూర్తి చేశారు కాబట్టి. 

గడపగడపకు కార్యక్రమం కింద ఇంటింటికి ఎమ్మెల్యేలు వెళితే.. మేనిఫెస్టో కాఫీతో సహా ఏ పనులు తాము పూర్తి చేశామో ప్రజలకు సాధికారంగా వివరించి చెప్పిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటిది మేనిఫెస్టోలను ప్రజలను మోసం చేయడానికి మాత్రం వాడుకుని ఆ తర్వాత కనుమరుగు చేసే అలవాటు ఉన్న చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రహసనప్రాయంగా ఉంది.