కరోనా టైమ్ లో టాలీవుడ్ కాళ్లు, చేతులు ముడుచుకుని వున్నట్లు కనిపిస్తోంది. కానీ తెరవెనుక వ్యవహారం వేరే వుంది. యంగ్ టాలెంట్ కోసం వేట కొనసాగుతోంది. కోటి నుంచి మూడు కోట్లలో యంగ్ టాలెంట్ సినిమాలు తీసి చూపిస్తున్నారు. కృష్ణ అండ్ హిస్ లీట,, భానుమతి రామకృష్ణ లాంటి సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ కు ఓటిటి అనేది పోటీగా కనిపిస్తుండగానే, నిర్మాతలకు ఆల్టర్ నేటివ్ బిజినెస్ ఆఫర్ లా కనిపిస్తోంది.
అది కూడా మన చేతుల్లోకి తీసుకుంటే పోలా? అన్న ఆలోచన మొదలైంది. పెద్ద బ్యానర్లు, పెద్ద దర్శకులు ఇప్పుడు ఇదే ఆలోచనలో పడ్డారు. తమ దగ్గర వున్న లైన్లను ఓటిటి సినిమాలుగా మార్చాలనుకుంటున్నారు. వీలయితే మెయిన్ స్ట్రీమ్ లో విడుదల చేసి, ఓటిటి ఇవ్వడం లేదా అంటే నేరుగా ఓటిటికి ఇవ్వడం ఇదీ అయిడియా.
పది కోట్ల నుంచి పదిహేను కోట్లు తీసుకునే దర్శకులకు మూడు కోట్లలో సినిమా రెడీ అయిపోతుందంటే ఆశ్చర్యంగా వుంది,. వాళ్లు ఎక్కి వచ్చిన మెట్లు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఇంత తక్కువలో, ఇంత మంచి అవుట్ పుట్ ఇచ్చే కొత్త తరహా ఆలోచనల డైరక్టర్ల కోసం వేట సాగిస్తున్నారు. మరో పక్క తమ దగ్గర వున్న సహాయకులకు చాన్స్ ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తున్నారు.
యంగ్ డైరక్టర్లు, కొత్త వాళ్లు కాస్త నమ్మకం కలిగించగలిగితే చాలు అడ్వాన్స్ లు చేతిలో పడుతున్నాయి. పైగా కాస్త యంగ్ నిర్మాతలు అయిన సితార, షైన్ పిక్చర్స్, మైత్రీ జిఎ 2, యువి లాంటి సంస్థలు ఇటే దృష్టి పెట్టాయి. దిల్ రాజు లాంటి వాళ్లు తమ పలుకుబడి వాడాలనుకుంటున్నారు. కానీ వీళ్లు డబ్బులు వాడుతున్నారు. దాంతో జనాలు అటు వెళ్లకుండా ఇటు వస్తున్నారు.
మొత్తం మీద టాలీవుడ్ లో కొత్త కదలిక కనిపిస్తోంది. ఈ కదలిక ఫలితం మరో ఏడాది తరవాత కచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇదే సమయంలో మంచి హీరోలు కూడా తెరపైకి వచ్చే అవకాశం వుంది. మామూలుగా సినిమా అయితే సిద్దూ లాంటి హీరోను అంత సులువుగా మన టాలీవుడ్ జనం దగ్గరకు తీయరు. కానీ కృష్ణ లీల సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అతన్ని ఇప్పుడు బిజీ హీరోను చేస్తోంది.
సరైన సినిమాలు పడితే ఇంకా యంగ్ జనరేషన్ బయటకు వస్తుంది. ఈ ఇంటి పేర్లు, వంశాలు, వారసులు, అవే మొహాలను రుద్దే కార్యక్రమం కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇన్ ఫా స్ట్రక్చర్ ను తక్కువ వాడి తమ టాలెంట్ ను, అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని వాడి సినిమాలు చేస్తూ, వాటిని ఓటిటికి ఇస్తూ వుంటే, ఎటువంటి బ్యాక్ గ్రవుండ్ లేకుండా వచ్చే హీరోల సంఖ్య పెరుగుతుంది. టాలీవుడ్ మీద ఆధిపత్య ధోరణి అన్నది తగ్గుతుంది.