ఓ కుర్రాడు. మరి కొంత మంది స్నేహ బృందం. ఒక రిసార్ట్ అద్దెకు తీసుకున్నారు. ఓ అమ్మాయిని, అబ్బాయిని తీసుకువచ్చారు. బాగా ఇంటిమసీగా ఫోజలు పెట్టించి ఫోటోలు తీసారు.. అదే విధంగా సినిమా తీయడం ప్రారంభించారు. వాట్సాప్ లో ఆ అమ్మాయి ప్రొవోకింగ్ ఫోటోలు చలామణీ చేయడం ప్రారంభించారు. ఇంతలో ఇదేదో అనుమానించాల్సిన వ్యవహారంలా వుందని ఎవరో పోలీసులకు ఉప్పందించారు. ఆ అమ్మాయి ఫొటోలు, ఆ షూటింగ్ వ్యవహారం చూసి, పోలీసులు ఈ వ్యవహారంలోకి అడుగుపెడతారా? పెట్టరా? మరి కాస్త ముందుకు వెళ్లి బ్లూఫిలిం తీస్తున్నారనే అనుమానంతో కేసు బుక్ చేస్తారా? చేయరా? ఇది బ్లూఫిలిమ్ కాక మరేంటీ? అని నిలదీయరా?
మరి ఆర్జీవీ సంగతేమిటి? ఆయన చేస్తున్నది ఇదే కదా? ఆయన సినిమా తీయడం మొదలుపెడుతూనే, అప్పర అనే చిన్న హీరోయిన్ ఫొటోలు ఎడా పెడా వదిలారు. అసలు అవి ఇలాంటి అలాంటి ఫొటోలా? కుర్రకారును కిర్రెక్కించే స్టిల్స్ కాదా అవి? సరే, ఆ తరువాత ఏం చేసారు. మరో మాంచి ఫిజిక్ వున్న అబ్బాయిని తీసుకు వచ్చి, వాత్సాయిన కామసూత్రాల్లో కాస్త రీజనబుల్ భంగిమలు, లేదా కామసూత్ర యాడ్ కోసం తీసినట్లుండే భంగిమలు పెట్టించి ఫొటోలు వదిలారు?
ఇప్పుడు ఇదే విధంగా మరెవరు అయినా చేస్తే, పోలీసులు ఇలాగే చూసి చూడనట్లు వదిలేస్తారా? అలా అంటే ఇండస్ట్రీలో ఖాళీగా చాలా మంది వున్నారు. బోలెడు మంది అమ్మాయిలు వున్నారు, అబ్బాయిలు వున్నారు, వంద, రెండు వందలు టికెట్ పెట్టి వేయడానికి శ్రేయాస్ ఏటిటి ల్లాంటివి చాలా పుట్టుకువస్తున్నాయి. ఇలాంటి వ్యవహారానికి లైసెన్స్ ఇచ్చేసినట్లేనా? సినిమా తీసుకుంటే తీసుకోవచ్చు. విడుదలయిన తరువాత సంగతి చూడోచ్చు కానీ ముందుగా ఈ అర్ధనగ్న, ముప్పావు నగ్న ప్రచారం ఏమిటి?
పెద్ద దర్శకుడు, తెగించేసాడు. ఎవరూ అతని జోలికి వెళ్లరు. ఛానెళ్ల కూడా ఆయనను కూర్చోపెట్టి డిస్కషన్లు పెడతాయి తప్ప, అసలు ఇదేంటీ అని ప్రశ్నించవు. మరి ఇదే పని వేరే వాళ్లు చేసుకోవచ్చా? అసలు పోలీసులు, ప్రభుత్వం, మీడియా ఏమంటాయో, ఎలా రియాక్ట్ అవుతాయో తెలుసుకోవడం కోసం అయినా, వేరే వాళ్లు కూడా ఇదే దారి పట్టి ట్రయ్ చేయడం అవసరం. అప్పుడు కానీ ఈ వ్యవహారానికి తెరపడదేమో?