నేను ఫెయిల్ అయ్యా…కానీ ప‌వ‌న్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మ‌రోసారి మెగాస్టార్ చిరంజీవి ప్రేమ క‌న‌బ‌రిచారు. ఏదో ఒక రోజు ప‌వ‌న్‌ను అత్యున్న‌త స్థానంలో చూస్తామ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాల అంతు చూడ‌లేక‌పోయాన‌ని, కానీ త‌న త‌మ్ముడు ప‌వ‌న్…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మ‌రోసారి మెగాస్టార్ చిరంజీవి ప్రేమ క‌న‌బ‌రిచారు. ఏదో ఒక రోజు ప‌వ‌న్‌ను అత్యున్న‌త స్థానంలో చూస్తామ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాల అంతు చూడ‌లేక‌పోయాన‌ని, కానీ త‌న త‌మ్ముడు ప‌వ‌న్ అలా కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. హైద‌రాబాద్‌లోని వైఎన్ఎం క‌ళాశాల‌లో పూర్వ విద్యార్థుల స‌మావేశానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ ఏదైనా త‌ల‌స్తే దాన్ని అంతు చూడ‌డం అనేది త‌న‌కు అలవాటైంద‌న్నారు. కానీ తాను అంతు చూడంది ఏంటో మీకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేద‌న్నారు. మళ్లీ వెన‌క్కి వ‌చ్చేశాన‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి స‌క్సెస్ కాలేక‌పోయిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌త్యేకంగా గుర్తు చేసుకున్నారు. రాజ‌కీయాల్లో తాను రాణించ‌లేకపోవ‌డానికి కార‌ణాలేంటో ఆయ‌న చెప్పారు.

రాజ‌కీయాల్లో సున్నిత మ‌న‌స్త‌త్వంతో ఉండ‌కూడ‌ద‌న్నారు. బాగా మొర‌టుగా వుండాలి, రాటు తేలాల‌ని ఆయ‌న అన్నారు. మాట‌లు అనాలి, అనిపించుకోవాల‌ని చెప్పారు. అవ‌స‌ర‌మా ఇది? అని ప్ర‌శ్నించుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. రాజ‌కీయాల‌కు త‌ను (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) త‌గిన వాద‌న్నారు. అంటాడు, అనిపించుకుంటాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్పారు. అలాంటి వాళ్ల‌కు మీరంతా ఉన్నారన్నారు. మీ అంద‌రి స‌హాయ స‌హ‌కారాల‌తో ఏదో ఒక రోజు అత్యున్న‌త స్థానంలో ప‌వ‌న్‌ను చూస్తామ‌ని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

తాను సున్నిత మ‌న‌స్కుడు కావ‌డం వ‌ల్లే రాజ‌కీయాల్లో రాణించ‌లేక‌పోయిన‌ట్టు ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు. మాట‌లు అన‌డం, అనిపించుక‌వ‌డం త‌న వ‌ల్ల కాద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా అన‌డం గ‌మ‌నార్హం. అన్న చిరంజీవి ఆకాంక్ష‌ను త‌మ్ముడు ఎంత వ‌రకు నెర‌వేరుస్తారో చూడాలి.