రాజకీయాల్లో వారసత్వాలకు ఎపుడూ ఎక్కడా లోటు లేనే లేదు. అలా కనుక చూసుకుంటే చాలా మంది నాయకులు ఆ విధంగా రాణిస్తున్న వారే.
ఇదిలా ఉంటే ఏపీలో అత్యంత కీలకమైన పదవిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన క్రిష్ణ దాస్ తన రాజకీయ వారసుడిగా కుమారుడు డాక్టర్ క్రిష్ణ చైతన్యను తెచ్చేశారు. ఆయన లోకల్ వార్ లో సడెన్ గా ఎంట్రీ ఇచ్చేశారు.
ఆయన శ్రీకాకుళం జిల్లాలోని పోలాకీ జెడ్పీటీసీగా ఘన విజయం సాధించారు. ఈ జిల్లా పరిషత్ మహిళలకు రిజర్వ్ అయింది. అయితే రెండు వైఎస్ చైర్మన్ పోస్టులు ఉంటాయి. దాంతో అందులో ఒకదానిని క్రిష్ణ చైతన్యకు ఇస్తారని ప్రచారం గట్టిగా సాగుతోంది.
మరి లక్ గట్టిగా తగిలితే ఈ యువ నేత ఏకంగా కీలకమైన జిల్లా పదవిలో కుదురుకుంటారని చెప్పేయవచ్చు. ఇదిలా ఉంటే జిల్లా రాజకీయాల్లో ధర్మాన ఫ్యామిలీ ఇపుడు బాగానే దూకుడు చేస్తోంది. దాంతో కొత్త తరం కూడా దూసుకువస్తోంది.
ఒక విధంగా లోకల్ బాడీ ఎన్నికలు రేపటి రాజకీయ నేతలను కూడా రెడీ చేసి పెట్టాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.