సీనియర్ ఐఏఎస్ అధికారి, జగన్ కేసుల్లో నిందితురాలైన శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ కేసుల్లో శ్రీలక్ష్మి కొంత కాలం జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి ఆమె డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఏపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా వుండగా దాల్మియా కేసులో విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టుకు గురువారం హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోపు వారెంట్‌ను జారీ చేయాలని కోర్టు ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
జగన్‌కు సంబంధించిన వివిధ కేసుల్లో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. పెన్నా కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.వెంకట్రామిరెడ్డి, వాన్‌పిక్ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, రిటైర్ట్ ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి ఇవాళ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అలాగే జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి.