మన వాళ్లకు ఇదే బాగుంది

సినిమా తీయడం అంటే మాటలు కాదు. కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. సరైన స్క్రిప్ట్ దొరకాలి. నలభై కోట్లు అని చెప్పి 80 కోట్లు చేసే దర్శకుడు కాకుండా, పద్దతిగా తీసే దర్శకుడు కావాలి. ఇన్నీ…

సినిమా తీయడం అంటే మాటలు కాదు. కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. సరైన స్క్రిప్ట్ దొరకాలి. నలభై కోట్లు అని చెప్పి 80 కోట్లు చేసే దర్శకుడు కాకుండా, పద్దతిగా తీసే దర్శకుడు కావాలి. ఇన్నీ జ‌రిగాక సినిమా సరిగ్గా రావాలి. మళ్లీ దాని మీద ట్రోల్స్ రాకూడదు. నెగిటివ్ పబ్లిసిటీ ని తట్టుకోవాలి. అప్పుడు కానీ పెట్టిన పెట్టుబడి వెనక్కు వస్తుందో రాదో తెలియదు. ఇలాంటి టైమ్ పరభాషల నుంచి వస్తున్న సినిమాలు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వున్న మన బడా నిర్మాతలకు భలే మంచి చౌకబేరము అన్నట్లు కనిపిస్తున్నాయి.

పెట్టుబడి పెద్దగా పెట్టనక్కరలేదు. అందుకు బదులుగా నామినల్ కమిషన్ అందుకుంటున్నారు. చేయాల్సిందల్లా తమకు వున్న డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను ఉపయోగిస్తే చాలు. పైగా గతంలో అయితే డబ్బింగ్ సినిమాలు కొనడం అనే కాన్సెప్ట్ వుండేది. కానీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. పెట్టుబడి పెట్టక్కరలేదు. ఏ ఖర్చూ పెట్టక్కరలేదు. కానీ రిస్క్ ఎలాగూ వుండదు కనుక నామినల్ కమిషన్ ఇస్తున్నారు.

ఎలాగూ డిస్ట్రిబ్యూషనర్ నెట్ వర్క్ వుంది కనుక నామినల్ కమిషన్ కూడా సరిపోతుందని, పైగా సినిమా భయంకరమైన హిట్ అయితే చిన్న మొత్తాలే పెద్దగా వస్తాయని ప్రూవ్ అయిపోయింది. కేజిఎఫ్ 2 సినిమా కు ముందుగా భారీ అడ్వాన్స్ లు అడిగారు. కానీ చివర్లో విడుదల దగ్గర చేసి, కమిషన్ తగ్గించి, అడ్వాన్స్ లు తగ్గించేసారు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు భయంకరంగా కిట్టుబాటు అయింది. దాని మీద దిల్ రాజుకు మంచి లాభాలు వచ్చాయి.

ఇటీవల కాంతారా సినిమా కూడా అంతే. ఈ మధ్య గీతా సంస్థ అన్నీ డబ్బులు పొగొట్టుకోవడం తప్ప రాబట్టుకోవడం లేదు. కానీ డబ్బింగ్ సినిమా కాంతారా మంచి సంపాదన అందించింది. అందుకే డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వున్న బడాబాబులు అంతా ఇలా నామినల్ కమిషన్ మీద వచ్చే సినిమాల కోసం చూస్తున్నారు. అందులోనూ హిందీ, కన్నడ, తమిళ ఇలా అన్ని భాషల్లో మాంచి పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. అవన్నీ మన దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, అన్నపూర్ణ సంస్థ లకు మంచి ఛాన్స్ లు గా మారుతున్నాయి.