మెగా విడుదల టైమ్ లో ‘అల్లు’

ఒక పక్క సంక్రాంతి కి రాబోయే సినిమాలకు థియేటర్ల హడావుడి అలాగే వుంది. డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఇవ్వవద్దంటూ నిర్మాతల కౌన్సిల్ లేఖ రాయడం జ‌రిగింది. అది జ‌స్ట్ లెటర్ సేక్ తప్ప దాని…

ఒక పక్క సంక్రాంతి కి రాబోయే సినిమాలకు థియేటర్ల హడావుడి అలాగే వుంది. డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఇవ్వవద్దంటూ నిర్మాతల కౌన్సిల్ లేఖ రాయడం జ‌రిగింది. అది జ‌స్ట్ లెటర్ సేక్ తప్ప దాని వల్ల ఒరిగేది లేదని అందరికీ తెలుసు. పైగా ఇప్పటికే వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, వారసుడు సినిమాలకు థియేటర్ల ఒప్పందం జ‌రిగిపోయింది.

మరోపక్క తమిళ సినిమాలకు తెలుగునాట థియేటర్లు ఇవ్వకపోతే, తెలుగు సినిమాలను తాము రానివ్వమని తమిళ జ‌నాల నుంచి ప్రతిఘటన మొదలైంది. వీటన్నింటికి తోడు సింగిల్ థియేటర్లు, రెండే థియేటర్లు వున్న చోట, బాలయ్య సినిమానా? మెగాస్టార్ సినిమానా? అన్న రగడ వుండనే వుంది.

ఇలాంటి టైమ్ లో డబ్బింగ్ సినిమాలను అడ్డు కోవడం అస్సలు సాధ్యం కాదని టాలీవుడ్ కింగ్ పిన్, మెగాస్టార్ చిరంజీవి బంధువు అల్లు అరవింద్ నే కామెంట్ చేయడం విశేషం సంతరించుకుంది. నిజానికి అరవింద్ కలుగచేసుకుని మెగాస్టార్ సినిమాకు సరిగ్గా థియేటర్లు దొరికేలా చేస్తారని అంతా అనుకుంటారు. కానీ దానికి వ్యతిరేకంగా, డబ్బింగ్ సినిమాలను అడ్డుకోవడం సాధ్యం కాదని అరవింద్ అనడం కచ్చితంగా టాలీవుడ్ లో చర్చకు దారితీస్తుంది.

ప్రొడ్యూసర్స్ గిల్డ్ ను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, టాలీవుడ్ లో కీలకమైన వ్యక్తి అయిన అరవింద్ నే అలా అనేసిన తరువాత ఇక సంక్రాంతికి విడుదలయ్యే వారసుడు సినిమాకు అడ్డు అన్నదే వుండదు.