అప్పుడు హరికృష్ణ.. ఇప్పుడు కోడెల!

తమ పార్టీ నేతల మరణాలను రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడుకు కొత్త కాదు. ఎన్టీఆర్ నుంచి ఇదే పరంపర కొనసాగుతూ ఉందని విశ్లేషకులు అంటున్నారు. బతికి ఉన్నప్పుడు వారికి చుక్కలు చూపించడం, చనిపోయాకా.. వారిపై…

తమ పార్టీ నేతల మరణాలను రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడుకు కొత్త కాదు. ఎన్టీఆర్ నుంచి ఇదే పరంపర కొనసాగుతూ ఉందని విశ్లేషకులు అంటున్నారు. బతికి ఉన్నప్పుడు వారికి చుక్కలు చూపించడం, చనిపోయాకా.. వారిపై వచ్చే సానుభూతిని తన రాజకీయానికి అనుగుణంగా వాడుకోవడం చంద్రబాబుకు కొత్తకాదని అంటారు పరిశీలకులు.

ఎన్టీఆర్ ను పదవి నుంచి దించాకా… ఆయనను చంద్రబాబు నాయుడు ఎలా ట్రీట్ చేశారో అనేది బహిరంగ సత్యమే. ఆయనపై చెప్పులు వేయించారు. ఆయన అవసరం పార్టీకి లేదని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతేగాక ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేవని చంద్రబాబు నాయుడు ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ క్షోభతో మరణిస్తే.. ఆ తర్వాత ఆయన ఇమేజ్ ను ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ను దేవుడన్నారు.. తను ఎన్టీఆర్ కు చేసింది జనాలు మరిచిపోయాకా.. ఆయనను ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు.

ఇక హరికృష్ణ పరిస్థితి గురించి కూడా తెలిసిందే. హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వం ఆమోదం పొందడంలో చంద్రబాబు హస్తముందని అంటారు. ఆపై ఆయనకు ఎలాంటి పదవులూ ఇవ్వలేదు. అవకాశం ఉన్నా మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. అయితే రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించాకా.. చంద్రబాబు నాయుడు మళ్లీ ఆయన కుటుంబం పై సానుభూతిని వాడుకునే ప్రయత్నం చేశారు.

కూకట్ పల్లిలో ఆయన కూతురును నిలబెట్టారు. అయితే సానుభూతి దక్కలేదు! ఇప్పుడు కోడెల వంతు. బతికి ఉండగా.. ఆయనకు టీడీపీ కనీసం మద్దతు తెలపలేదు. కే ట్యాక్స్ లు, అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారాల్లో నోరు మెదపలేదు. ఇప్పుడు మాత్రం కోడెల మరణించారని.. సానుభూతిని చంద్రబాబు నాయుడు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఇలాంటివన్నీ మామూలే అంటున్నారు!

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ