కొండ పొలంలో అంతా నిశ్శబ్దం.. కారణం అదేనా?

వైష్ణవ్ తేజ్, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించిన కొండపొలం సినిమాకు సంబంధించి గతంలోనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అదే ఊపులో హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్స్ కూడా రివీల్ చేశారు. అంతే త్వరగా ఓ సింగిల్…

వైష్ణవ్ తేజ్, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించిన కొండపొలం సినిమాకు సంబంధించి గతంలోనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అదే ఊపులో హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్స్ కూడా రివీల్ చేశారు. అంతే త్వరగా ఓ సింగిల్ కూడా విడుదల చేశారు. 

ఇక ఇదే ఊపులో రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే కొండపొలం సైలెంట్ అయింది. ఎలాంటి సందడి లేదు.

ఈ సినిమాకు గట్టిగా ప్రచారం చేయాలని అనుకున్నాడట క్రిష్. కానీ హరిహర వీరమల్లు సినిమా పనుల్లో బిజీ అయిపోయాడట. అటు వైష్ణవ్ తేజ్ కూడా తన మూడో సినిమా సినిమా స్టార్ట్ చేశాడు. హీరోయిన్ రకుల్ కూడా హిందీ ప్రాజెక్టుతో బిజీ అయిపోయింది. అందుకే కొండపొలం సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేయలేదట. హీరోహీరోయిన్లు ఎప్పుడు ఫ్రీ అవుతారో చూసుకొని, అప్పుడు డేట్ వేస్తారని అంటున్నారు. 

కానీ అసలు రీజన్ ఇది కాదు. ఇది కేవలం పైకి చెప్పే కారణం మాత్రమే. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. కొండపొలం సినిమాకు ఇంకా బిజినెస్ పూర్తికాలేదు. మరీ ముఖ్యంగా నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. అందుకే విడుదల తేదీని పెండింగ్ లో పెట్టారు.

ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ స్టార్ అయిపోయాడు. ఆ స్టార్ డమ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు క్రిష్. అందుకే కళ్లుతిరిగే రేట్లు చెబుతున్నాడట. దీంతో నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇంకా క్లోజ్ అవ్వలేదని తెలుస్తోంది. ఉప్పెన సినిమా శాటిలైట్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. 

కాబట్టి కొండపొలం శాటిలైట్ ను కనీసం 9 కోట్ల రూపాయలకైనా అమ్మాలనేది క్రిష్ ప్లాన్. ఈమధ్య తనను సంప్రదించిన ఓ ఛానెల్ కు ఏకంగా 18 కోట్లు (శాటిలైట్+డిజిటల్) డిమాండ్ చేశాడట ఈ దర్శకుడు కమ్ నిర్మాత.