Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిన్న సినిమాలకు 'దిల్ రాజు' సమస్య

చిన్న సినిమాలకు 'దిల్ రాజు' సమస్య

డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోదరుని కొడుకు ఆశిష్ రెడ్డి సినిమా రౌడీబాయిస్ ఇప్పడు ఇండస్ట్రీలో అనేక చిన్న సినిమాల విడుదలకు అడ్డంకిగా మారింది. ఆయన తన సినిమా విడుదల దసరాకు అని ప్రకటించారు. కానీ కచ్చితంగా వుంటుందా? వుండదా? అన్నది క్లారిటీ లేదు. 

లవ్ స్టోరీ విడుదల తరువాత కానీ డెసిషన్ వుండదని ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. కానీ దసరా డేట్ ను వదులుకోలేక అనేక సినిమాలు విడుదల చేసే ఆలోచనలో వున్నాయి. కానీ దిల్ రాజు సినిమా వుంటే అలా చేయడం చాలా మందికి సాధ్యం కాదు. 

యువి వంశీకి దిల్ రాజుతో వ్యాపార భాగస్వామ్యం వుంది. ఆయన మారుతి డైరక్షన్ లో నిర్మించిన చిన్న సినిమా 'మంచి రోజులు వచ్చాయి' విడుదలకు రెడీగా వుంది. డేట్ ప్లాన్ చేయాలా? వద్దా? అన్నది డిసైడ్ కాలేకపోతున్నారు. 

ఆసియన్ సునీల్ నిర్మించిన లక్ష్య సినిమా సెన్సారు అయిపోయి రెడీగా వుంది. అది కూడా దసరాకు విడుదల చేయాలని వుంది. కానీ రౌడీ బాయిస్ సంగతి తెలిస్తే కానీ డేట్ ఫిక్స్ చేసుకోలేరు. ఎందుకంటే ఆయనకు దిల్ రాజుతో బంధాలు వున్నాయి. 

సితార సంస్థ నిర్మించిన వరుడు కావలెను సినిమా విడుదలకు రెడీగా వుంది. సెన్సారు ఒక్కటే బాకీ. ఆ సినిమాను దసరా బరిలోకి దింపాలని వుంది. కానీ రౌడీ బాయిస్ విడుదల డేట్ తెలియదు. ఎందుకంటే వరుడుకావలెను కూడా దిల్ రాజు విడుదల చేసే సినిమానే. 

ఇలా దిల్ రాజు, శిరీష్ ల సినిమా కావడంతో చాలా మంది తమ తమ సినిమాల డేట్ లను ప్రకటించకుండా హోల్డ్ లో పెట్టుకోవాల్సి వచ్చింది. దిల్ రాజు పక్కాగా తమ సినిమా వస్తుంది అంటే వీళ్లు ఆల్టర్ నేటివ్ డేట్ చూసుకుంటారు. లాస్ట్ మినిట్ లో దిల్ రాజు తమ సినిమాను వాయిదా వేస్తే, అనవసరంగా మంచి డేట్ మిస్ అవుతుంది. 

నిజానికి దసరా బరిలోకి రెండు మూడు సినిమాలు దిగొచ్చు. కానీ శిరీష్ తనయుడి తొలి సినిమా కావడంతో వారం అవతల, వారం ఇవతల ఏ సినిమా లేకుండా, సోలోగా బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?