బాబుకు ఈసారి గట్టిగానే?

చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. పైగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నేత. మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన నాయకుడు. అటువంటి బాబుకు ఎవరూ ప్రత్యేకంగా ఏదీ చెప్పనక్కరలేదు. కానీ చిత్రమేంటంటే ఆయన…

చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. పైగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నేత. మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన నాయకుడు. అటువంటి బాబుకు ఎవరూ ప్రత్యేకంగా ఏదీ చెప్పనక్కరలేదు. కానీ చిత్రమేంటంటే ఆయన చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు కూడా  గట్టిగానే ఉంటాయి మరి.

ఒక్కోసారి బాబు రాజకీయ జీవితం కన్నా చిన్న వారు కూడా ఆయన మీద బాణాలు వేస్తారు. అయినా తప్పదు, ఎందుకంటే కెలికిన తరువాత అవతల వారు ఊరుకోరు కదా. ఇక విషయానికి వస్తే విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ గురించి,  అశోక్ గజపతి రాజుకు మద్దతుగా  బాబు చేసిన కొన్ని కామెంట్స్ కి   ట్రస్ట్  చైర్ పర్సన్  సంచయిత  గజపతి రాజు ఘాటుగానే రిప్లై ఇచ్చారు.

చంద్రబాబును పూసపాటి గజపతుల కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చవద్దంటూ కాస్తా మర్యాదగానే చెప్పాల్సింది ఆమె చెప్పేశారు. తన బాబాయి అశోక్ గజపతిరాజు మాదిరిగా చంద్రబాబుకు లింగ భేదాలు ఉంటాయని తాను అనుకోవడం లేదని కూడా సంచయిత సెటైర్లు వేశారు. తాను  గజపతులకు చట్టపరంగా వారసురాలినని, అన్ని  హక్కులూ కలిగిన దానినని, మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా తనకు ఆ పదవిని నిర్వహించే  స్థాయి  అర్హత ఉన్నాయని సంచయిత చెప్పుకున్నారు.

విజయనగర సంస్థానాధీశులు పీవీజీ రాజు మనవరాలినని, ఆయన పెద్ద కుమారుడు దివంగత ఆనంద గజపతిరాజు పెద్ద కుమార్తెనని ఆమె పేర్కొంటూ గజపతుల వంశానికి తానే ఏకైక వారసుడిని అని తన బాబాయి అశోక్ గజపతి రాజు చంద్రబాబుని తప్పుతోవ పట్టించారేమోనని కూడా సెటైర్లు వేశారు.

మొత్తానికి ఇది పూర్తిగా తన కుటుంబ వ్యవహారం, దీని జోలికి వచ్చి పదే పదే  రాజకీయం చేయవద్దు చంద్రబాబూ అంటూ రెండు చేతులు జోడించి మరీ పెద్దాయనను వేడుకుంటున్నారు. మరి చంద్రబాబుకు ఈ వేడుకోలు వినిపిస్తుందా. ఇకనైన గజపతుల ఆస్తుల  గొడవల్లోకి తల దూర్చకుండా ఉంటారా. చూడాలి మరి.

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు

విశాఖ ఫార్మాసిటీ లో భారీ అగ్నిప్రమాదం