బన్నీ దగ్గరకు కొరటాల శివ?

దాదాపు రెండేళ్ల విలువైన కాలం వృధా అయిపోయింది దర్శకుడు కొరటాల శివకు. ఏ ముహూర్తాన ఆచార్య సినిమా ప్రారంభించారో కానీ, ఇప్పటికి పూర్తి కాలేదు. మరో ఆరు నెలలకు కూడా పూర్తవుతుందనే ఆశ కనిపించడం…

దాదాపు రెండేళ్ల విలువైన కాలం వృధా అయిపోయింది దర్శకుడు కొరటాల శివకు. ఏ ముహూర్తాన ఆచార్య సినిమా ప్రారంభించారో కానీ, ఇప్పటికి పూర్తి కాలేదు. మరో ఆరు నెలలకు కూడా పూర్తవుతుందనే ఆశ కనిపించడం లేదు. కానీ ఆరునెలలు అయినా, ఏడాది అయినా పూర్తి చేయాల్సిందే కదా? పక్కన పెట్టడానికి లేదు. 

అయితే ఆ తరువాత ఏంటీ? అన్నది పాయింట్. రామ్ చరణ్  తో చేస్తారు అని టాక్ వినిపించింది. మరో మిడ్ రేంజ్ యంగ్ హీరో పేరు కూడా వినిపించింది.  రామ్ చరణ్ తన తరువాత సినిమాను వంశీ పైడిపల్లితో ఫిక్స్ అయ్యాడని బయటకు వచ్చింది.

ఇలాంటి నేపథ్యంలో హీరో బన్నీతో కొరటాల శివ తరువాత సినిమా ఫిక్స్ అయిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.  బన్నీ ఇప్పుడు చేస్తున్న సినిమా తరువాత కొరటాల శివ సినిమా, ఆ తరువాత మళ్లీ త్రివిక్రమ్ తో సినిమాలు రెండూ పక్కాగా లైన్ లో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తోంది.

ఇదే కనుక నిజమైతే బన్నీ లైనప్ ప్లానింగ్ అదిరినట్లే. ఇప్పటికే అలవైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డును స్వంతం చేసుకుని, మహేష్ ను, రామ్ చరణ్ ను వెనక్కు నెట్టాడు. ఇఫ్పుడు కొరటాల శివ, ఆ పై త్రివిక్రమ్ లాంటి కాంబినేషన్ అంటే ఓ రేంజ్ లో వుంటుంది వ్యవహారం. 

విశాఖ ఫార్మాసిటీ లో భారీ అగ్నిప్రమాదం

సిక్స్ ప్యాక్ లో నాగ శౌర్య