టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు రెడీ అవుతోంది. టీజర్ విడుదలయింది. టీజర్ విడుదల కావడంతో సినిమాకు బజ్ అమాంతం పెరిగింది. దాంతో సినిమా మార్కెటింగ్ ఈజీ అయింది.
ఆంధ్ర ఏరియా మొత్తం సింగిల్ పాయింట్ లో విక్రయించారు. వెస్ట్ గోదావరికి చెందిన ఉష బాలకృష్ణ ఆంధ్ర ఏరియాను 18 కోట్లకు తీసుకున్నారు. ఆయన కిందకు అమ్ముకుంటారు. నైజాం ఏరియాను ఆసియన్ సినిమాస్ ద్వారా ఎప్పటిలాగే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు.
సీడెడ్, ఓవర్ సీస్ క్లోజ్ చేయాల్సి వుంది. ఓవర్ సీస్ కు కాస్త ఎక్కువ రేటే కోట్ చేస్తున్నాను. 3.50 కోట్ల నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అందులో బయ్యర్లు కాస్త ముందు వెనుక ఆడుతున్నారు. సీడెడ్ ను ఇవ్వాళో రేపో క్లోజ్ చేస్తారు.
టైగర్ నాగేశ్వరరావు మంచి పోటీలో విడుదలవుతోంది. అటు బాలయ్య భగవత్ కేసరి, ఇటు విజయ్ లియో సినిమాలు బరిలో వున్నాయి. ఈ రెండింటిని తట్టుకోగల స్టఫ్ టైగర్ లో వుందనే బయ్యర్లు నమ్ముతున్నారు.ఈ సినిమాకు నిర్మాత అభిషేక్ అగర్వాల్. దర్శకుడు వంశీ.