జాబిల్లిపై భారత్ జెండా!

భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది… చంద్రయాన్​–3 సక్సెస్ ​అయ్యింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం కనిపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్​ అయ్యింది.  అతి తక్కువ బడ్జెట్ తో ఏ…

భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది… చంద్రయాన్​–3 సక్సెస్ ​అయ్యింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం కనిపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్​ అయ్యింది.  అతి తక్కువ బడ్జెట్ తో ఏ దేశానికి సాధ్యం కానిది భారత్ చేసి చూపింది. దీంతో ప్రపంచ దేశాలన్ని భారత్ వైపు చూస్తున్నాయి. అమెరికా, చైనా సరసన భారత్ నిలిచింది.

ప్రపంచదేశాలతో పోలిస్తే జాబిల్లిని చేరుకునేందుకు మనం కాస్త ఆలస్యంగా అడుగులు వేశాం. ఇది కూడా వ్యూహాత్మకమే. వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ ప్రయోగాన్ని, అత్యంత చౌకగా చేసిచూపించడం భారత్ లక్ష్యం. అందుకే టైమ్ తీసుకుంది. ఈ క్రమంలో వైఫల్యాలు కూడా చూసింది. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త చరిత లిఖించినట్లయింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా అవతరించింది.

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 విజయం నవభారత జయధ్వానం అంటూ ప్రశంసించారు. ఈ రోజును భారత్ ఎన్నడూ మర్చిపోదని అన్నారు.