బీజేపీకి చాన్స్ ఇచ్చేశావ్ బాబూ…

ఏ ముహూర్తాన చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మాట్లాడారో తెలియదు కానీ ఆ స్టేట్మెంట్ పక్కాగా బూమరాంగ్ అయింది. దాంతో వైసీపీ చెడుగుడు ఆడుకుంటోంది. చంద్రబాబు ఏమనుకుని మాట్లాడరో కానీ ప్రతిపక్షాలకు…

ఏ ముహూర్తాన చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మాట్లాడారో తెలియదు కానీ ఆ స్టేట్మెంట్ పక్కాగా బూమరాంగ్ అయింది. దాంతో వైసీపీ చెడుగుడు ఆడుకుంటోంది. చంద్రబాబు ఏమనుకుని మాట్లాడరో కానీ ప్రతిపక్షాలకు ఒక అస్త్రాని అందించారని మంత్రి సీదరి అప్పలరాజు అంటున్నారు. ఏపీలో టీడీపీని దెబ్బతీసి విపక్షం ప్లేస్ లోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీకి కోరి మరీ చంద్రబాబు చాన్స్ ఇచ్చేశారు అని మంత్రి సెటైర్లు వేశారు.

ఏపీలో తన రాజకీయ జీవితానికి సమాధిని ఆయన డేట్ టైం, ఇయర్ కూడా చూసి మరీ పెట్టుకున్నారని సీదరి ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి వచ్చే ఎన్నికలు ముగింపు అని తాము ఇప్పటిదాకా చెప్పామని ఆయన సైతం ఒప్పుకుంటున్నారు అంటే మానసికంగా ఎంతలా వత్తిడికి గురి అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు అని మంత్రి చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ఏపీ రాజకీయ రేసులో లేకుండా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని, దాన్ని నిజం చేస్తూ ఆ పార్టీకి తోవ ఇచ్చేస్తూ బాబు తన పొలిటికల్ కెరీర్ కి తానే ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నారని మంత్రి కౌంటరేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెబుతున్న చంద్రబాబు మొత్తం 175 సీట్లకు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు అని ఆయన నిలదీశారు.

ఈ రోజుకు అయినా ఒంటరిగా పోటీ చేస్తాను, పొత్తులు వద్దు అని బాబు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపూ జగన్ మీద విమర్శలు చేయడం తప్ప తమ పద్నాలుగేళ్ళ పాలనలో ఏం చేశామో చెప్పుకోలేకపోతున్నారు అంటే బాబు ఏమీ చేయనట్లే కదా అని ఆయన అంటున్నారు. సానుభూతి కోసం డ్రామాలు ఆడడం బాబుకే చెల్లు అని, అయితే ఇలాంటివి ఏపీ జనాలు అసలు పట్టించుకోరని, బాబు 2024 తరువాత శాశ్వతంగా మాజీ సీఎం గా మిగిలిపోతారని సీదరి జోస్యం చెప్పారు.

మంత్రి సీదరి అన్న మాటలను చూస్తే కనుక నిజమే అనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎలిమినేట్ చేస్తే తప్ప తాము ఎదగమని బీజేపీ భావిస్తోంది. ఇపుడు చంద్రబాబు సింపతీ కోసం కొట్టిన ఒక్క డైలాగ్ విపక్షాలకు బ్రమాండమైన ఆయుధమే కాకుండా పొత్తులతో మళ్లీ టీడీపీకి ఊపిరి పోయాలనుకున్న పార్టీలకు కూడా కొత్త ఆలోచనలు కలిగే చాన్స్ ని కావాలని బాబే ఇచ్చారని అంటున్నారు.