యంగ్ డైరక్టర్లు చూసిన మసూద

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, సినిమాల తరువాత నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన సినిమా ‘మసూద’. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ప్రీమియర్ ని పలువురు…

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, సినిమాల తరువాత నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన సినిమా ‘మసూద’. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ప్రీమియర్ ని పలువురు యువ దర్శకులకు ప్రదర్శించారు.

ఈ సంద్భంగా యువ దర్శకులు స్వరూప్, వెంకటేశ్ మహా, వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే… హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు. 

ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే వారికి కలిగిన అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు. ఈ జానర్ లో ఇంకొన్ని కథలు రావటానికి మసూద ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మా చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని మెప్పించిందో మసూద కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. 

చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు కశ్చితంగా నచ్చుతుంది అని మా నమ్మకం. సినిమా కోసం టీంలో అందరూ కష్టపడి పని చేశారు.' అని అన్నారు.