రాజమౌళి సెంటిమెంట్.. మళ్లీ అదే నిజమైందా!

సాహో వచ్చి 2 వారాలు దాటింది. నార్త్, ఓవర్సీస్ సంగతి పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది బ్రేక్-ఈవెన్ అందుకోలేకపోయింది. సో.. ఫ్లాప్ అని అధికారికంగా డిసైడ్ అయింది. ఈ టైమ్ లో మరోసారి…

సాహో వచ్చి 2 వారాలు దాటింది. నార్త్, ఓవర్సీస్ సంగతి పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది బ్రేక్-ఈవెన్ అందుకోలేకపోయింది. సో.. ఫ్లాప్ అని అధికారికంగా డిసైడ్ అయింది. ఈ టైమ్ లో మరోసారి “రాజమౌళి ఎఫెక్ట్” తెరపైకి వచ్చింది. రాజమౌళితో ఓ హిట్ కొట్టిన తర్వాత ఏ హీరో కెరీర్ అయినా దారుణంగా పడిపోతుంది. చరిత్ర చెబుతున్న సత్యం ఇది. సో.. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ పై కూడా పడిందంటున్నారు చాలామంది.

ఇప్పటివరకు రాజమౌళితో హిట్ కొట్టిన ఏ హీరో, తన నెక్ట్స్ సినిమాతో ఆ సక్సెస్ ను రిపీట్ చేయలేకపోయాడు. ఉదాహరణకు ఎన్టీఆర్ విషయాన్నే తీసుకుంటే.. రాజమౌళితో స్టూడెంట్ నంబర్-1 తీసిన తర్వాత సుబ్బు సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. రాజమౌళితో సింహాద్రి సినిమా చేసిన తర్వాత అతడికి ఆంధ్రావాలా రూపంలో మరో ఫ్లాప్ వచ్చింది. రాజమౌళితో యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎన్టీఆర్, ఆ తర్వాత కంత్రి రూపంలో మరో డిజాస్టర్ అందుకోక తప్పలేదు.

ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమేకాదు, రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరోది ఇదే పరిస్థితి. నితిన్ అయితే రాజమౌళితో సై సినిమా చేసిన తర్వాత చాన్నాళ్ల పాటు తేరుకోలేకపోయాడు. అటు రామ్ చరణ్ కూడా మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. రవితేజ, నాని లాంటి హీరోలు సైతం రాజమౌళితో సినిమాలు చేసి హిట్ కొట్టిన తర్వాత ఫ్లాపులు చూశారు. ప్రభాస్ కూడా ఈ సెంటిమెంట్ కు మరోసారి బలయ్యాడు. బాహుబలి-2 లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సాహోతో ఫ్లాప్ తెచ్చుకున్నాడు.

నిజానికి రాజమౌళి ఎఫెక్ట్ ప్రభాస్ కు కొత్తేంకాదు. గతంలో ఛత్రపతి విషయంలో కూడా ఇదే జరిగింది. జక్కన్న-ప్రభాస్ కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే ప్రభాస్ చేసిన పౌర్ణమి సినిమా ఫ్లాప్ అయింది. ఇలా రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలంతా ఆ వెంటనే ఫ్లాపులు అందుకోవడం విచిత్రం. సదరు హీరోలకు రాజమౌళి సెట్ చేసిన ఇమేజ్, అందించిన రికార్డులు, భారీగా పెరిగిన అంచనాలను అందుకోలేకపోవడం వల్ల ఈ ఫ్లాపులు వస్తున్నాయనేది నిజం. కానీ అదే ఇప్పుడు నెగెటివ్ సెంటిమెంట్ గా కూడా మారడం బాధాకరం.

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!