ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి దివ్య చౌక్సే కేన్సర్‌పై పోరులో అలసిపోయారు. ఆ దయలేని జబ్బుపై పోరాడేందుకు తనలో శక్తి లేదని గ్రహించిన ఆమె చివరి సారిగా అందరికీ బై అని చెప్పి ప్రాణాలు కోల్పోవడం మనసులను కదిల్చి వేస్తోంది.
‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో నటించిన దివ్య చౌక్సే కేన్సర్‌బారిన పడ్డారు. దానిపై విజయం సాధించి మళ్లీ మామూలు మనిషి అయ్యేందుకు సుదీర్ఘకాలం పోరాటం చేశారు. ఈ క్రమంలో ఆమె వీరమరణం పొందారు. ఈ విషయమై దివ్య చౌక్సే సమీప బంధువు సౌమ్యా అమిష్ వర్మ ధ్రువీకరించారు.
ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. అనారోగ్యంబారిన పడి మృతి చెందిన వారే ఎక్కువ. తాజాగా దివ్య మృతిపై బాలీవుడ్ మౌన రోదన చేస్తోంది. ఓ మంచి మనిషి, నటిని బాలీవుడ్ పోగొట్టుకుందని పలువురు నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆమె మృతిపై సినీనటుడు సాహిల్ ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో …‘ సినీపరిశ్రమపై మీ అభిరుచి, కల, సానుకూలత మీ అన్నయ్యగా నన్ను ఎంతో ముగ్ధున్ని చేశాయి. మీ ఆత్మకు శాంతి లభించాలి. మీ జ్ఞాపకాలకు మరణం లేదు. మీరు ఎప్పటికీ నా హృదయంలో బతికే ఉంటారు’ అని హృద్యమైన పోస్టు పెట్టారు.
ఇక్కడ మరో అద్భుతం గురించి చెప్పుకోవాలి. దివ్య చౌక్సే తన మరణం గురించి ముందే పసిగట్టారు. మరికొన్ని గంటల్లో తాను ఈ లోకాన్ని శాశ్వంగా వీడుతాననగా… తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం గుండెల్ని పిండేసే పోస్టు పెట్టారు. ‘కేన్సరుతో నేను నెలల తరబడిగా మరణ మంచం మీద ఉన్నాను…దివ్య చౌక్సే బై ’ అంటూ చివరి వాక్యాలను చెరగని ముద్రతో రాశారు. కేన్సర్‌పై సుదీర్ఘ కాలం యుద్ధాన్ని తలపించే పోరాటం చేసిన దివ్యది వీరమరణం అంటే అతిశయోక్తి కాదేమో!