తన ఆరోగ్య సమస్యను బయటపెట్టిన మహేష్

హీరోహీరోయిన్లు ఎవ్వరూ పెద్దగా తమ ఆరోగ్య సమస్యల్ని బయటకు చెప్పుకోరు. అవకాశాలు దెబ్బతింటాయని కొందరు, మొహమాటానికి మరికొందరు ఇలాంటి విషయాల్ని బయటపెట్టరు. మహేష్ మాత్రం తనకున్న ఓ ఆరోగ్య సమస్యను బయటపెట్టాడు. దాన్నుంచి ఎలా…

హీరోహీరోయిన్లు ఎవ్వరూ పెద్దగా తమ ఆరోగ్య సమస్యల్ని బయటకు చెప్పుకోరు. అవకాశాలు దెబ్బతింటాయని కొందరు, మొహమాటానికి మరికొందరు ఇలాంటి విషయాల్ని బయటపెట్టరు. మహేష్ మాత్రం తనకున్న ఓ ఆరోగ్య సమస్యను బయటపెట్టాడు. దాన్నుంచి ఎలా బయటపడ్డాడో కూడా వివరించాడు. చాన్నాళ్ల పాటు మైగ్రేన్ తో ఇబ్బందిపడ్డాడట మహేష్.

“చాలా ఏళ్లుగా మైగ్రేన్ తో బాధపడ్డాను. దానికి నివారణ లేదని చాలామంది చెప్పారు. చాలామంది డాక్టర్లను కలిశాను. అందరూ నివారణ లేదనే చెప్పారు. టాబ్లెట్స్ మాత్రం ఇచ్చేవారు. చాలా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. ప్రతిరోజూ షూటింగ్ ఉంటుంది. భారీ లైట్స్, సౌండ్స్ పడుతుంటాయి. అదంతా నాపై చాలా ప్రభావం చూపించాయి. దీంతో పెయిన్ కిల్లర్స్ కు అలవాటు పడిపోయాను.”

ఇలా రోజు తప్పించి రోజు తనకు మైగ్రేన్ వచ్చేదని వెల్లడించాడు  మహేష్. ఒకసారి వస్తే 6-7 గంటల పాటు ఆ తలనొప్పితో అలా బాధపడేవాడినని, చివరికి నాడీ వైద్యం ద్వారా తన సమస్యకు ఓ పరిష్కారం దొరికిందంటున్నాడు మహేష్. ప్రస్తుతం తనకు మైగ్రేన్ సమస్యలేదని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానని చెబుతున్నాడు.

తన వ్యక్తిగత విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటానని, అందుకే మైగ్రేన్ విషయాన్ని కూడా బయటపెట్టానంటున్నాడు మహేష్. తనలాంటి సమస్య చాలామందికి ఉంటుందని, వాళ్లందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. ప్రస్తుతం ఈ హీరో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?