పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. మైత్రీమూవీస్-హరీష్ శంకర్, ఎఎమ్ రత్నం-క్రిష్, దిల్ రాజు పింక్ సినిమా పేరు, అన్నీ బలంగా వినిపిస్తున్నాయి. క్రిష్-ఎఎమ్ రత్నం సినిమా ఆల్ మోస్ట్ ఫైనల్ అని కూడా వినిపిస్తోంది.
ఇలాంటి టైమ్ లో మరో డైరక్టర్ గట్టు చప్పుడు కాకుండా, సైలంట్ గా అమరావతి వెళ్లి పవన్ ను కలిసి వచ్చినట్లు, లైన్ నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ డైరక్టర్ ఎవరోకాదు. గోపాల గోపాల సినిమాతో పవన్ కు దగ్గరయిన డాలీ. ఈ దర్శకుడు కొద్దిరోజుల క్రితం అమరావతికి వెళ్లి సినిమా విషయమై డిస్కషన్లు జరిపి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంతకీ డాలీ ఎవరి తరపున సినిమా చేయబోతున్నారు అంటే, నిర్మాత రామ్ తాళ్లూరి పేరు వినిపిస్తోంది. ఈయన జనసేన కోసం చాలా సేవ చేసారు. ఆర్థికంగా కూడా చాలా ఖర్చుపెట్టారు అని టాక్ వుంది. ఆయనకు ఓ సినిమా చేయాల్సిన బాధ్యత పవన్ కు వుందని చిరకాలంగా వినిపిస్తోంది.
అంటే మొత్తానికి పవన్ రీఎంట్రీ కోసం చూస్తున్న నిర్మాతల జాబితా మూడు నుంచి నాలుగుకు పెరిగింది. హారిక హాసిని ఎంటర్ కాలేదు కానీ, లేదూ అంటే అయిదు అయ్యేది.