అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌ మోజేంటి?

ప్రభాస్‌కి హిందీలో మార్కెట్‌ స్థిరపడిపోయింది. ఇక ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ రాజమౌళి సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు క్యూలో వున్నారు. ఇంతకాలం హిందీవైపు చూడని అల్లు అర్జున్‌కి కూడా అక్కడో రాయి వేయాలనే బుద్ధి…

ప్రభాస్‌కి హిందీలో మార్కెట్‌ స్థిరపడిపోయింది. ఇక ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ రాజమౌళి సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు క్యూలో వున్నారు. ఇంతకాలం హిందీవైపు చూడని అల్లు అర్జున్‌కి కూడా అక్కడో రాయి వేయాలనే బుద్ధి పుట్టింది. తన హిందీ అనువాద చిత్రాలకి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి కనుక స్ట్రెయిట్‌గా ఒక సినిమా అక్కడ విడుదల చేయాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడు.

అందుకే త్వరలోనే ఒక పాన్‌ ఇండియా కథతో సినిమా చేయాలని అల్లు అర్జున్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. తన దగ్గరకు వచ్చే దర్శకులకి కూడా ఇదే చెబుతున్నాడు. కేవలం తెలుగు సినిమా మార్కెట్‌ని దృష్టిలో వుంచుకోవడం కాకుండా హిందీలో సేల్‌ అయ్యే సబ్జెక్ట్‌ పట్టుకురమ్మని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఓకే అయిన 'ఐకాన్‌' కథని కూడా అలా పాన్‌ ఇండియా మార్కెట్‌కి అనుగుణంగా మార్చమని అడిగినట్టు భోగట్టా.

తన తోటి హీరోలు హిందీలో మార్కెట్‌ తెచ్చుకుంటూ వుంటే తాను మాత్రం రాజమౌళి వచ్చే వరకు ఎందుకు వేచి చూడాలని అనుకుంటున్నాడేమో. ఇంతకుముందు తమిళంలో స్ట్రెయిట్‌ సినిమా చేయాలని చూసాడు కానీ ఆ ఆలోచన డ్రాప్‌ అయ్యాడు. మరి హిందీ కలని అయినా పట్టాలెక్కిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.  

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?