ర‌ష్మిక‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన బాలీవుడ్ హీరో!

త‌న బాలీవుడ్ డెబ్యూతోనే ప్ర‌శంస‌ల‌ను పొందుతోంది న‌టి ర‌ష్మిక‌. సౌత్ లో స్టార్ స్టేట‌స్ లో పెద్ద హీరోల సినిమాల్లో అవ‌కాశాల‌తో భారీ రెమ్యూనిరేష‌న్ తో చేతినిండా ఛాన్సుల‌తో బిజీగానే ఉన్న ర‌ష్మిక ఇప్పుడు…

త‌న బాలీవుడ్ డెబ్యూతోనే ప్ర‌శంస‌ల‌ను పొందుతోంది న‌టి ర‌ష్మిక‌. సౌత్ లో స్టార్ స్టేట‌స్ లో పెద్ద హీరోల సినిమాల్లో అవ‌కాశాల‌తో భారీ రెమ్యూనిరేష‌న్ తో చేతినిండా ఛాన్సుల‌తో బిజీగానే ఉన్న ర‌ష్మిక ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా త‌న దృష్టిని పెట్టింది. కెరీర్ మీద ఫుల్ కాన్స‌న్ ట్రేష‌న్ చేసిన ర‌ష్మిక ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోవ‌డం లేదు. 

ఎక్క‌డ‌కూ ప‌రిమితం అయ్యే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టుగా లేదు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ అవ‌కాశాన్ని కూడా ఒడిసి ప‌ట్టింది. ఈ అమ్మ‌డి టైమ్ కూడా అలా క‌లిసి వ‌స్తున్న‌ట్టుగా ఉంది. ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న ర‌ష్మిక హిందీ ఎంట్రీ ఇస్తోంది. మిష‌న్ మ‌జ్నూ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ర‌ష్మిక‌. ఇటీవ‌లే 'షేర్షా' సినిమాతో దేశ వ్యాప్తంగా మ‌రింత గుర్తింపుకు నోచుకున్న సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఈ సినిమాలో హీరో.

బాలీవుడ్ లో ఇప్పుడు మంచి ఊపు మీదున్న సిద్ధార్థ్ మ‌ల్హోత్రా సినిమాతో ర‌ష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో.. ర‌ష్మిక‌ను ఆకాశానికెత్తేశాడు సిద్ధార్థ్. ఆమెను ఒక రేంజ్ లో ప్ర‌శంసించాడు. ఆమె అత్యంత ప్ర‌తిభావంత‌మైన న‌టి అని కూడా అన్నాడు. ఆమెతో జ‌త క‌ట్ట‌డం త‌న‌కు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింద‌న్నాడు. త‌మ పెయిర్ తెర‌పై చాలా ఫ్రెష్ గా ఉంటుంద‌ని కూడా సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ఇలా బాలీవుడ్ లో త‌న తొలి సినిమాలో ప‌ని చేసిన హీరో ఈ రేంజ్ లో ప్ర‌శంసించ‌డంతో ర‌ష్మిక ఉబ్బిత‌బ్బిబ్బు అయిపోతుండ‌వ‌చ్చు. 

ఈ ప్ర‌శంస‌లు ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాల‌కు బాట వేస్తాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. సౌత్ నుంచి వెళ్లి ముంబైలో స‌ర్దుకుంటున్న ర‌ష్మిక‌కు సిద్ధార్థ్ వంటి  వాడి ప్ర‌శంస‌లు అక్క‌డ పాగా వేయ‌డానికి ఎంతో కొంత ఉప‌క‌రిస్తాయి. మిష‌న్ మ‌జ్నూ మాత్ర‌మే గాక‌.. గుడ్ బై అనే మ‌రో హిందీ సినిమాలో కూడా న‌టిస్తోంది ర‌ష్మిక‌.