25 లక్షలు గెల్చుకున్న మహేష్

ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారం అవుతున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ  షో కి గెస్ట్ గా వచ్చేవారు ఎవరైనా పాతిక లక్షలకు మించి గెల్చుకోరేమో? లేదా అక్కడితో ఆపేయిస్తారో? ఈ షో…

ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారం అవుతున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ  షో కి గెస్ట్ గా వచ్చేవారు ఎవరైనా పాతిక లక్షలకు మించి గెల్చుకోరేమో? లేదా అక్కడితో ఆపేయిస్తారో? ఈ షో ఆరంభంలో రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి గేమ్ ఆడారు. 25 లక్షలు గెల్చుకున్నారు. 

ఇప్పుడు మహేష్ బాబు గేమ్ ఆడారు. ఆ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కావాల్సి వుంది. అయితే ఆయన కూడా 25 లక్షలే గెల్చుకున్నారని తెలుస్తోంది. 

ఈ అమౌంట్ ఎలాగూ ఛారిటీకే ఇస్తారు. సరదా కబుర్ల నడుమ సాగిన ప్రశ్న, సమాధానం కార్యక్రమంలో మహేష్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి గెల్చుకున్నది మాత్రం పాతికలక్షలు అని తెలుస్తోంది. 

ప్రభాస్ కోసం ప్రయత్నాలు

ఎవరు మీలో కోటీశ్వరుడు షో ను రక్తికట్టించాలంటే హోస్ట్ గా ఎన్టీఆర్ వుంటే సరిపోదు. సెలబ్రిటీ లు గెస్ట్ లుగా రావాలి.  ఇఫ్పటికే కొరటాల, రాజమౌళి, రామ్ చరణ్, మహేష్ బాబు అయిపోయారు. 

ప్రభాస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొందరి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా టాప్ లీగ్ జనాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తరువాతే సెకెండ్ రేంజ్ కు వస్తారు.