అల్లు అరవింద్, చిరు కుటుంబాలు రెండు వేర్వేరు కాదు అనే రీతిలో అత్యంత అన్యోన్యంగా ఉంటాయి. బహుశా ఈ కాలంలో కూడా అంత ప్రేమాభిమానాలతో ఐక్యంగా ఉండడం అద్భుతమే. అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఒకరి కోసం ఒకరు అన్నంత వాత్సల్యంతో ఉంటారు. దీనికి అల్లు అరవింద్, చిరంజీవి సంస్కారమే కారణమని చెప్పాలి.
అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌పై మెగాస్టార్ సినిమాలు అనేకం నిర్మించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ అంటే చిరంజీవి సంస్థే అనే అభిప్రాయం కలిగేంతగా ఆ బ్యానర్‌పై సినిమాలు తెరకెక్కాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అల్లు అరవింద్ కూడా మారుతూ వచ్చారు. తాజాగా ఆయన 'ఆహా' అనే ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను సొంతంగా తీసుకొచ్చారు. సహజంగానే మెగా, అల్లు హీరోల చిత్రాలన్నీ అల్లు అరవింద్‌కు సంబంధించిన ఆహాలో విడుదలవుతాయని అనుకుంటారు.
కానీ కొత్తగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత మాత్రం తన మేనమామ అల్లు అరవింద్‌కు షాక్ ఇచ్చారు. సుస్మిత తన మొట్టమొదటి వెబ్ సిరీస్‌ను ఆనంద్ రంగా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను జీ5కు ఇస్తూ అగ్రిమెంట్ కుదుర్చుకుని అల్లు అరవింద్‌కు షాక్ ఇచ్చారనే టాక్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. సుస్మిత తీర్చిదిద్దు తున్న మొదటి వెబ్ సిరీస్ మేనమామ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కాకుండా ఇతర వేదిక నుంచి విడుదల చేయాలనుకోవడం వెనుక ఏం జరిగిందనే చర్చకు దారి తీస్తోంది.
సహజంగానే అల్లు అరవింద్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'ఆహా'లో సుస్మిత తన వెబ్‌సిరీస్‌ను విడుదల చేస్తుందని ఆశించిన, ఊహించిన వాళ్లందరికీ షాక్ ఇచ్చే నిర్ణయమనే చెప్పాలి. ఊహించని పరిణామానికి అల్లు అరవింద్ రియాక్షన్‌పై ఆసక్తి నెలకొంది.