ఇన్నాళ్లకు డబ్బింగ్.. పైగా హడావుడి

నాగార్జున రాజన్న సినిమా జనాలకు గుర్తుండే వుంటుంది ఎంతోకొంత. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరక్ట్ చేసిన సినిమా. ఆఫ్ కోర్స్ దర్శకుడిగా రాజమౌళి పేరు కూడా వుంటుందనుకోండి. ఆయన కొన్ని యాక్షన్…

నాగార్జున రాజన్న సినిమా జనాలకు గుర్తుండే వుంటుంది ఎంతోకొంత. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరక్ట్ చేసిన సినిమా. ఆఫ్ కోర్స్ దర్శకుడిగా రాజమౌళి పేరు కూడా వుంటుందనుకోండి. ఆయన కొన్ని యాక్షన్ సీన్లు డైరక్ట్ చేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజమౌళి టీమ్ నే ఈ సినిమాకూ పనిచేసింది.

నాగార్జున తనే నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఫ్లాపుగానే ముద్రపడింది. అయితే, ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత అంటే దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఆ సినిమాను ఇప్పుడు తమిళంలో డబ్ చేస్తున్నారు. బాహుబలి త్రయం రాజమౌళి, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ అందించిన సినిమా అంటూ హడావుడి చేస్తున్నారు.

ఈ సందర్భంగా విడుదల ఫోస్టర్ ను నిర్మాత ఆర్బీ చౌదరి చేత విడుదల చేయించారు. మరి ఈ హడావుడి అంతా నాగ్ కు, రాజమౌళి అండ్ కోకు తెలుసో? తెలియదో? తమిళ డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్న వారు ఎవరో చేస్తున్న హడావుడి ఏమో? బాహబలి క్రేజ్ ను వాడేసుకుందామనే ఆలోచన కావచ్చు.

నీ సినిమా గురించి అడిగి కడిగి పారేస్తా.. హీరో