దటీజ్ జగన్.. మరో హామీ అమలు

అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి ఒకటే లక్ష్యం. అవినీతిరహిత పాలన అందించాలి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఈ పాయింట్ల ఎజెండాతోనే పనిచేస్తున్నారు జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలకమైన హామీల్ని అమలుచేసిన ముఖ్యమంత్రి..…

అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి ఒకటే లక్ష్యం. అవినీతిరహిత పాలన అందించాలి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఈ పాయింట్ల ఎజెండాతోనే పనిచేస్తున్నారు జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలకమైన హామీల్ని అమలుచేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు మరో హామీ అమలుకు మార్గం సుగమం చేశారు. ప్రత్యేకహోదా ఉద్యమం సమయంలో నమోదైన కేసుల్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఈనెల 4న జరిగిన కేబినెట్ భేటీలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదిప్పుడు అధికారికంగా అమలైంది. ప్రత్యేకహోదా ఉద్యమం టైమ్ లో నమోదైన కేసుల్ని ఎత్తేయాల్సిందిగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఈ కేసుల్ని తొలిగించబోతున్నారు. ఇక కోర్టుల్లో ఉన్న కేసుల్ని కూడా సంబంధిత లాయర్లు ఉపసంహరించుకోబోతున్నారు.

ప్రత్యేకహోదా కోసం ఆంధ్రప్రదేశ్ యువత రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. కానీ ప్యాకేజీకి కక్కుర్తిపడిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. యువత చేస్తున్న ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా తొక్కేశారు. హోదా అంటే జైలుకే అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. అలా ఎన్నో తప్పుడు కేసులు రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యాయి. అలాంటి వాళ్లందరికీ అండగా నిలిచారు జగన్.

వైసీపీ అధికారంలోకి రాగానే యువతపై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అలా జగన్ ఇచ్చిన హమీ ఈరోజు అమలైంది. ప్రత్యేకహోదా కోసం పోరాడిన యువకులపై అక్రమంగా వేసిన కేసుల్ని ఎత్తేయడంతో పాటు మరోవైపు తనే స్వయంగా ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు జగన్.

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదా అంశాన్ని కేంద్రం ముందుంచారు. ఓవైపు కేంద్రప్రభుత్వం, మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని ఎంతగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, జగన్ మాత్రం హోదాపై వెనక్కితగ్గలేదు. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకురావడానికి నిత్యం కృషిచేస్తూనే ఉన్నారు. తన ప్రతి ఢిల్లీ పర్యటనలో హోదా అంశాన్ని చేర్చుతున్నారు జగన్.

నీ సినిమా గురించి అడిగి కడిగి పారేస్తా.. హీరో