వీరసింహారెడ్డి సినిమా సెట్ మీద వుండగానే సీనియర్ హీరో బాలకృష్ణ తరువాత సినిమా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం లో సాహు గారపాటి నిర్మించే ఈ సినిమా కోసం ఒక్కో ఏర్పాటు జరిగిపోతోంది.
వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ లోనే మొదలు కావాల్సి వుంది. కానీ వీరసింహారెడ్డి సినిమా ఆలస్యం కావడంతో ఈ సినిమా అలా పక్కన వుండాల్సి వచ్చింది. అయితే మరింత ఆలస్యం కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచకా ఫినిష్ చేసేస్తున్నారు.
బాలయ్య గెటప్ ఎలా వుండాలి అనే దాని మీద మూడు రకాల స్కెచ్ లు వేయించి, వాటికి అనుగుణంగా విగ్ లు ముంబాయిలో చేయిస్తున్నారు. బాలయ్య సినిమాలకు ఇది చాలా కీలకం. విగ్ సెట్ అయితే బాలయ్య లుక్ బాగుంటుంది. విగ్ సెట్ కాక బాలయ్య సినిమాలు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా వున్నాయి.
ఇదిలా వుంటే సినిమాలో కీలకమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకుంటున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాలయ్య సినిమాలో విలన్ గా చేయడానికి అర్జున్ రాంపాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
ఇక మిగలింది హీరోయిన్ పాత్ర. దీని కోసం వేట సాగుతోంది. కాస్త థర్టీ ప్లస్ లా కనిపించే పాత్ర కావడంతో ఎవరు సెట్ అవుతారు అని డిస్కషన్లు సాగుతున్నాయి. గతంలో బాలయ్య పక్కన నటించిన ఆసిన్ అయితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది కానీ ఆమెకు పర్సనల్ ఇబ్బందులు వున్నాయని తెలుస్తోంది.