బాలీవుడ్ బ్యూటీ రేఖ ఉంటున్నబంగ్లాకు సీల్ వేశారు. వయసు పెరిగినా ఆమె అందంలో వన్నె తగ్గలేదు. ఆమె అందచందాల ముందు వయసు వెలవెలబోతోంది. ఇప్పుడంటే కొత్తకొత్త అందగత్తెలతో బాలీవుడ్ తళుక్కుమని మెరుస్తోంది కానీ, నిన్న మొన్నటి వరకు శ్రీదేవి, హేమమాలిని, మాధురీదీక్షిత్, రేఖలాంటి బాలీవుడ్ భూలోక రంభ, ఊర్వసిలతో ఓ వెలుగు వెలిగింది.
ఇక సుందరాంగి రేఖ విషయానికి వస్తే ఆమె ముంబైలో ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా రేఖ సెక్యూరిటీ గార్డ్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రేఖ అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. రేఖ నివాస బంగ్లా ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ ప్రాంతంలో ఉంది. ఈ ఇంటికి ముద్దుగా స్ప్రింగ్ అని పేరు పెట్టారు.
రేఖ బంగ్లాకు ఎప్పుడూ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కాపలా ఉంటారు. వీరిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. దీంతో మిగిలిన సిబ్బందికి కరోనా పరీక్షలు చేయనున్నారు. ఇదిలా ఉండగా రేఖ నివాస బంగ్లాకు ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. భవనం చుట్టుపక్కల కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ ఆ నోటీసులో వివరాలు వెల్లడించారు. అంతేకాదు ఆ బంగ్లా చుట్టుపక్కల నివాస సముదాయాల్లో కూడా కరోనా పరీక్షలు చేపట్టారు.