బాలీవుడ్ బిగ్ బి కి దురదృష్టవశాత్తూ కరోనా సోకింది. ఆయనకే కాదు, ఆయన కుటుంబ సభ్యుల్లో పలువురికి కూడా. మన తెలుగు బిగ్ హీరోలు, సూపర్ హీరోలు అందరూ ఆయన త్వరగా కోలుగోవాలని విసెష్ చెప్పారు. కోలుకుంటారు కూడా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిందేమిటంటే తనకు కరోనా సోకిందని తెలియగానే అమితాబ్ నే స్వయంగా తెలియచేసారు. పబ్లిక్ ఫ్లాట్ ఫారమ్ మీద తెలియ చేయడమే కాకుండా, ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా జాగ్రత్తపడాలని సూచన చేసారు.
కచ్చితంగా ఇది గొప్ప విషయం. కరోనా మహమ్మారి అన్నది ఇవ్వాళ, రేపు ఎవరికైనా సోకొచ్చు. అది పెద్ద విషయం కాదు. అలాంటి వ్యాపించే గుణం వున్న వ్యాధి అది. కానీ అది సోకింది అని ధైర్యంగా చెప్పుకుని, జనాలను జాగ్రత్తగా వుండమని చెప్పడం అన్నది చిన్న విషయం కాదు.
ముఖ్యంగా అమితాబ్ లాంటి సెలబ్రిటీలకు వచ్చి, వారు ధైర్యంగా పోరాడి, తగ్గించుకున్నారు అంటే అది ఒక స్ఫూర్తిగా మిగులుతుంది. కానీ మన తెలుగునాట సినిమాజనాలు మాత్రం కరోనా సోకితే అది ఎంత గుట్టుగా దాచేద్దామా? అని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల అనేక రకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. వాళ్లకి వచ్చిందట..వీళ్లకు సోకిందట అంటూ…అదే రాజకీయ నాయకుల విషయం లో మాత్రం ఇట్టే బయటకు వస్తోంది. సినిమా జనాలు మాత్రం గుట్టుగా వుంచుతున్నట్లు కనిపిస్తోంది.