బన్నీ ఏదీ వదిలిపెట్టలేదు

బాహుబలి బాక్సాఫీస్ రికార్డులు మినహా… ‘అల వైకుంఠపురములో’తో అల్లు అర్జున్ ఏ రికార్డునీ వదిలి పెట్టలేదు. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం విజయానికి పునాదులు వేయడంతో పాటు యూట్యూబ్‌లో గత రికార్డుల సౌధాలనూ…

బాహుబలి బాక్సాఫీస్ రికార్డులు మినహా… ‘అల వైకుంఠపురములో’తో అల్లు అర్జున్ ఏ రికార్డునీ వదిలి పెట్టలేదు. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం విజయానికి పునాదులు వేయడంతో పాటు యూట్యూబ్‌లో గత రికార్డుల సౌధాలనూ బద్దలు కొట్టింది. టిక్‌టాక్‌లో ‘బుట్టబొమ్మ’ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఏర్పడ్డారు. మొదట్లో ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’ తర్వాత అనిపించుకున్న ‘బుట్టబొమ్మ’ వీడియో రిలీజ్ అయిన తర్వాత వైరల్‌గా మారింది.

‘అల వైకుంఠపురములో’ వీడియో సాంగ్స్‌లోను బుట్టబొమ్మేక ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. బన్నీ సిగ్నేచర్ స్టెప్స్‌కి క్రికెటర్స్ కూడా ఫాన్స్ అయ్యారు. ‘ఫిదా’లోని వచ్చిండే పాటకు మించిన వ్యూస్ ఈ పాటకు రావడం విశేషం. ఇప్పుడు తెలుగు సినిమా పాటల్లో బుట్టబొమ్మేక ఎక్కువ వ్యూస్ వున్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే త్వరలోనే మూడొందల మిలియన్ వ్యూస్… ఆ తర్వాత అంతకు మించిన వ్యూస్ కూడా ఈ పాట సొంతమవుతాయి.

తమన్ మళ్లీ ఇలాంటి సంచలనాన్ని ఇప్పట్లో సృష్టించగలడా? అల్లు అర్జున్ తదుపరి చిత్రం పుష్పకు దేవిశ్రీప్రసాద్ ఈ స్థాయి సెక్సస్‌ఫుల్ మ్యూజిక్ అందించగలడా? 

మామా కోడలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్