సైరా ఓవర్ సీస్ @ 15 కోట్లు

సైరా నరసింహారెడ్డి ఓవర్ సీస్ డీల్ లాక్ అయింది. గత రెండు మూడు రోజులుగా దీని మీద రకరకాలు వార్తలు వినిపించాయి. ఎక్స్ క్లూజివ్ గా తెలిసింది 18 కోట్లు అంటూ గ్యాసిప్ వార్తలు…

సైరా నరసింహారెడ్డి ఓవర్ సీస్ డీల్ లాక్ అయింది. గత రెండు మూడు రోజులుగా దీని మీద రకరకాలు వార్తలు వినిపించాయి. ఎక్స్ క్లూజివ్ గా తెలిసింది 18 కోట్లు అంటూ గ్యాసిప్ వార్తలు కనిపించాయి. కానీ ఈ రోజే ఫైనల్ అయిందన్నది, అది కూడా 15 కోట్లకే అన్నది వాస్తవం. 

సాహో సినిమాను చేసిన ఫారస్ సంస్థనే సైరా విదేశీ పంపిణీ హక్కులు తీసుకుంది. ఒక విధంగా ఇది ఇరు వర్గాలకు మంచి బేరమే అనుకోవాలి. ఇటీవల ఓవర్ సీస్ మార్కెట్ బాగా పడిపోయింది. మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమానే అనుకున్న రేంజ్ కు చేరడం కష్టం అయింది. సాహో సినిమా సగానికి సగం నష్టాలు మిగిల్చింది. 

ఇలాంటి టైమ్ లో 15 కోట్లు రావడం అంటే మంచి విషయమే. ఇక బయ్యర్ సైడ్ నుంచి చూసుకుంటే అమెరికా మార్కెట్ లో మెగాస్టార్ కు వున్న క్రేజ్, సినిమాకు వున్న బజ్ అన్నీ కలిసి 10 కోట్లకు పైగా వస్తుందని ఆశిస్తున్నారు. అందువల్ల ఇరువర్గాలకు ఇది మంచి డీల్ అని తెలుస్తోంది.

ఇదిలావుంటే అమెరికాలో ఫారస్ సంస్థనే పంపిణీ చేస్తుందా? లేక అక్కడ తెలుగు సినిమాల పంపిణీ లో అనుభవం వున్న సంస్థ ద్వారా చేస్తుందా? అన్నది ఇంకా తేలలేదు గ్రేట్ ఇండియా, బ్లూ స్కై, వీకెండ్ సినిమా సంస్థలు ఈ డీల్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీకెండ్ సినిమా మంచి క్యాష్ ఆఫర్ తో ముందుకు వస్తే, బ్లూ స్కై, గ్రేట్ ఇండియా తమ తమ సర్కిళ్ల ద్వారా యుఎస్ డీల్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఏ విషయం గురువారం తేలుతుంది.