ఎప్పటికి ఆ మాటలు ఆడు వాడు ధన్యుడు అన్నాడు సుమతీకారుడు. ఇప్పటి తరం రాజకీయ నాయకులు ఈ గుణాన్ని పుణికిపుచ్చుకున్నారు. అందులో మన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అయితే మాస్టర్ డిగ్రీ చేసేసారు అందులో.
ఎనిమిదేళ్ల క్రితం జై మోడీ..జై బాబు అన్నారు..సరిగ్గా నాలుగేళ్ల క్రితం..బాబు..లోకేష్ బాబుల అవినీతి గుర్తుకు వచ్చింది.అంతే కాదు. మోడీ అంటే కోపం కూడా వచ్చింది. రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చారు, అని ఓపెన్ గా ఎద్దేవా చేసారు.
సరే, ఎన్నికలు వచ్చాయి. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పలకరించింది. దాంతో మళ్లీ మోడీ శరణం గచ్ఛామి..బాబు శరణం గచ్ఛామి అన్నారు. లేటెస్ట్ గా మోడీని కలిసి వచ్చారు. ఆంధ్ర పరిస్థితుల గురించి వివరించా అన్నారు. అంతే తప్ప పాచిపోయిన లడ్లు వెనక్కు తీసుకుని మంచి లడ్లు ఇవ్వమని అడగలేదు.
పైగా ఈ రోజు వున్నట్లుండి మోడీ భజన మొదలుపెట్టారు. అది కూడా మామూలుగా కాదు. తెలుగు, హిందీ భాషల్లో. జనసైనికుల కోసం తెలుగులో ట్వీట్ వేయడం. మోడీ కోసం దాన్ని హిందీలో తర్జుమా చేసి మరో ట్వీట్ వేయడం. పైగా దాన్ని పిఎమ్ఓ ఆఫీసుకు ట్యాగ్ చేయడం.
ఇలాంటి మాట నిలకడ లేని మనిషిని జనం నమ్మాలి. నచ్చితే జై అంటారు. నచ్చకుంటే పాచిపోయిన లడ్లు అంటారు. పవన్ ఏమన్నా, ముందు వెనుక చూడకుండా భలే. భలే అని ఎగిరి గంతులు వేసే ఫ్యాన్స్ వుండనే వున్నారు. అందుకే పవన్ ఏ మాత్రం పట్టించుకోకుండా తడవకో అభిప్రాయం మార్చకుంటూ వస్తున్నారు. 2024 ఎన్నికల తరువాత ఏం మాట్లాడతారో మరి?