చెప్పులు విస‌ర‌డమే కాక ఆ హీరోయిన్‌తో అంత ఘోరంగా…

నిజంగా ఆ హీరోయిన్ చెప్పేది వింటుంటే…మ‌రీ అంత ఘోర‌మా అని ఆగ్ర‌హించ‌కుండా ఉండ‌రు. ప్ర‌ముఖ హీరోయిన్ కంగ‌నారౌత్ త‌న‌తో న‌టి, ద‌ర్శ‌క‌-నిర్మాత పూజా భ‌ట్ తండ్రి మ‌హేశ్ భ‌ట్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై నేడు నోరు…

నిజంగా ఆ హీరోయిన్ చెప్పేది వింటుంటే…మ‌రీ అంత ఘోర‌మా అని ఆగ్ర‌హించ‌కుండా ఉండ‌రు. ప్ర‌ముఖ హీరోయిన్ కంగ‌నారౌత్ త‌న‌తో న‌టి, ద‌ర్శ‌క‌-నిర్మాత పూజా భ‌ట్ తండ్రి మ‌హేశ్ భ‌ట్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై నేడు నోరు తెరిచారు. బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య త‌ర్వాత బంధుప్రీతిపై విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్న విష‌యం తెలిసిందే.

ఈ ప‌రంప‌ర‌లో కంగ‌నా రౌత్ ముందు వ‌రుస‌లో నిలిచారు. తనకు మొదటి సినిమా  ‘గ్యాంగ్‌స్టర్‌’లో  అవకాశం ఇచ్చిన‌ నిర్మాత మహేశ్‌ భట్, ఆయన కుటుంబంపై కంగ‌నా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కంగ‌నాపై పూజా భ‌ట్ అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. మొదటి అవకాశం ఇచ్చిన త‌న తండ్రిపై ప్ర‌తిసారీ విమ‌ర్శ‌లు చేస్తోందంటూ పూజా భట్ ఓ సంద‌ర్భంలో అన్నారు.

దీనిపై కంగ‌నా సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు.

‘మీ నాన్న అవకాశం ఇవ్వడం వల్ల నాకు ఎప్ప‌టికీ కోలుకోలేని న‌ష్టం జ‌రిగింది. సరిగ్గా అదే స‌మ‌యంలో నాకు తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ అద్భుత అవ‌కాశం ఇచ్చారు. మీ ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమా వల్ల ‘పోకిరి’లాంటి మంచి సినిమా  వదులుకున్నాను’ అని పూజా భట్‌పై కంగ‌నా మండిపడ్డారు .

పూజా భ‌ట్ సోష‌ల్ మీడియాలో త‌న‌కు సంబంధించి షేర్ చేసిన వీడియోలు కంగ‌నాకు కోపం తెప్పించాయి. దీంతో ఆమె మ‌రింత రెచ్చిపోయి త‌న‌కు జ‌రిగిన అవ‌మానాల్ని ప్ర‌స్తావించారు.

‘నన్ను, నా టాలెంట్‌ను గుర్తించి  ‘గ్యాంగ్‌స్టర్‌’లో  దర్శకుడు అనురాగ్‌ బస్ అవ‌కాశం ఇచ్చారు. విశేష్‌ ప్రొడక్షన్స్‌ వారు నిర్మించారంతే. ఆ సినిమా టైమ్‌లో మీ ఫ్యామిలీ (పూజా భట్‌ ఫ్యామిలీ) వాళ్లు నాపై చెప్పులు విసిరి అవ‌మానించారు. అంతేకాదు, నీకు పిచ్చి ఉంది.. ఈ సినిమా తర్వాత నీ కథ ముగిసినట్లే అని విమర్శించారు’ అంటూ త‌న‌ను వేధిస్తున్న అవ‌హేళ‌న‌ల‌ను ఆమె తెర‌పైకి తెచ్చారు. కంగ‌నా రౌత్ దారుణ ఆరోప‌ణ‌ల‌పై పూజా భ‌ట్ ఎలా స్పందిస్తారో అని చిత్ర ప‌రిశ్ర‌మ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తోంది. మొత్తానికి నెపోటిజంపై చెల‌రేగిన వివాదం ఇప్ప‌ట్లో స‌ర్దుమ‌ణిగేలా లేదు. 

నేను డీసెంట్.. రవితేజ పెద్ద క్రాక్