ఐపోన్ 11 వచ్చేసింది.. రేటు ఎంతో తెలుసా?

మొబైల్ సెగ్మెంట్ లో ఆపిల్ సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఐఫోన్10తో మార్కెట్లో కొనసాగుతున్న ఈ సంస్థ, తాజాగా ఐఫోన్ 11ను విడుదల చేసింది. పూర్తిగా కెమెరా పనితనం, బ్యాటరీ బ్యాకప్…

మొబైల్ సెగ్మెంట్ లో ఆపిల్ సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఐఫోన్10తో మార్కెట్లో కొనసాగుతున్న ఈ సంస్థ, తాజాగా ఐఫోన్ 11ను విడుదల చేసింది. పూర్తిగా కెమెరా పనితనం, బ్యాటరీ బ్యాకప్ పై దృష్టిపెడుతూ తయారుచేసిన ఈ మోడల్స్ ను ఘనంగా ఆవిష్కరించింది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ విభాగాల్లో ఈ మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

ఐఫోన్10 మోడల్ లో హై-ఎండ్ ధర లక్ష రూపాయలు దాటిన నేపథ్యంలో.. ఐఫోన్ 11 సిరీస్ ధరలు చుక్కల్ని తాకుతాయని భారతీయ వినియోగదారులు అంచనా వేశారు. కానీ ఈసారి ఐఫోన్ రేట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది ఆపిల్ సంస్థ. అంచనాలకు భిన్నంగా ఐఫోన్ 11 బేసిక్ మోడల్ ను గరిష్టంగా 65 వేల రూపాయలుగా నిర్ణయించింది. ఐఫోన్ 11-ప్రో మోడల్ ను గరిష్టంగా (128 జీబీ) 86వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఐఫోన్ 11-ప్రో మ్యాక్స్ మోడల్ రేటును గరిష్టంగా (512 జీబీ) లక్షా 10వేల రూపాయలుగా నిర్ణయించారు. ఈ మోడల్ లో 3 కెమెరాలు ఉంటాయి. 

ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆర్థిక మాంద్యం ఛాయలు కమ్ముకున్నాయి. ఇటు చూస్తే ఇండియాలో ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. అందుకే ధరల విషయంలో ఆపిల్ సంస్థ ఈసారి ఆచితూచి వ్యవహరించింది. ఐఫోన్ 11 ప్రో-మ్యాక్స్ ధరల్ని మినహాయిస్తే, మిగతా 2 మోడల్స్ కు స్టోరేజ్ కెపాసిటీ ఆధారంగా అందుబాటు రేట్లు నిర్ణయించింది. అయితే వీటిలో కెమెరా ఫీచర్స్ కూడా మారతాయి. ఈనెల 20 నుంచి ఈ మోడల్స్ అన్నీ ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. 

ఐఫోన్10 నుంచి తమ ప్రతిష్టాత్మక హోమ్ బటన్ ను యాపిల్ సంస్థ తొలిగించిన విషయం తెలిసిందే. ఐఫోన్ 11కు కూడా అదే పద్ధతి ఫాలో అయింది. తాజా ఉత్పత్తులతో ప్రొఫెషలన్ ఫొటోగ్రాఫర్స్ తరహాలో ఫొటోలు తీసుకోవచ్చని యాపిల్ సంస్థ చెబుతోంది. వీడియోస్ ను కూడా 4కే రిజల్యూషన్ తో పిక్చరైజ్ చేసుకోవచ్చని తెలిపింది. 

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!