ప్రజస్వామ్యంలో ఎన్నికలు ఎపుడూ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. వాటికి లోకల్, స్టేట్ ఎలెక్షన్స్ అన్న తేడా ఉండదు, వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటే ఓటర్ ని ఎవరూ ఆపలేరు కూడా. టీడీపీ గట్టిగా ఉందనుకున్న రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా సార్లు నిలిచి గెలిచింది.
ఇక ఆ మధ్య జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఫలితం ముందే తెలిసే టీడీపీ చేతులెత్తేసింది అని అంతా అనుకున్నారు. ఎన్నికలను బహిష్కరించడం అంటే రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే. అలాంటి పని టీడీపీ చేసింది. ఇక పరిషత్ ఎన్నికలను రద్దు చేయాలని కూడా కోరింది. కోర్టు మెట్లూ ఎక్కారు.
ఇపుడు పరిషత్ ఎన్నికల ఫలితాలు వస్తూంటే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల ఫలితాలతో తమకు సంబంధం లేదు అంటున్నారు. ఇవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవు అని కూడా చెప్పేస్తున్నారు.
అందువల్ల రాష్ట్ర శాసనసభ రద్దు చేసి జగన్ ఎన్నికలకు సిధ్ధం కావాలని అచ్చెన్న డిమాండ్ చేస్తున్నారు. అంటే మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ఇపుడు పెడితే టీడీపీ గెలిచేస్తుంది అని అచ్చెన్నాయుడు గట్టిగా నమ్ముతున్నారన్న మాట.
దీని మీద వైసీపీ నేతలు కూడా రిటార్ట్ ఇస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా టీడీపీ వాలకం ఉందని కూడా సెటైర్లు వేస్తున్నారు. అయినా ఇప్పటికిపుడు శాసనసభకు ఎన్నికలు జరిగితే వైసీపీదే మళ్ళీ విజయం అని సర్వేలు కూడా లేటెస్ట్ గా చెప్పాయి.
ఏది ఏమైనా టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించి తప్పు చేసింది. ఇపుడు కొత్త వాదనను ఆ పార్టీ నేతలు ముందుకు తెస్తున్నారులా ఉంది.