‘యశోద’ ఫుల్ స్వింగ్

సమంత లేటెస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ యశోద ఫస్ట్ వీకెండ్ మంచి నెంబర్లు నమోదు చేసే దిశగా సాగిపోతోంది. తొలి రోజు నైజాంలో నమోదు చేసిన ఫలితాలకు మించి మలి రోజు నమోదు చేసింది.…

సమంత లేటెస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ యశోద ఫస్ట్ వీకెండ్ మంచి నెంబర్లు నమోదు చేసే దిశగా సాగిపోతోంది. తొలి రోజు నైజాంలో నమోదు చేసిన ఫలితాలకు మించి మలి రోజు నమోదు చేసింది. రెండు రోజులకు నైజాం 3.50 కోట్లు గ్రాస్ రావడం విశేషం. ఆంధ్ర కాస్త స్లో గా స్టార్ట్ అయినా రెండో రోజు పికప్ అయింది. పెద్ద సెంటర్లు తక్కువగా వున్న చోట్ల ఫిగర్లు తక్కువగా వున్నా, చాలా చోట్ల బాగున్నాయి.

విశాఖ రెండు రోజులకు 80 లక్షలు వసూలు చేసింది. కృష్ణా రెండు రోజులకు 40 లక్షలు, గుంటూరు 42 లక్షలు, సీడెడ్ 40 లక్షలు, ఈస్ట్ 28 లక్షలు వసూలు చేసింది. సండే కూడా మంచి ఫిగర్లు నమోదు చేస్తుందనే ఇండికేషన్లు వున్నాయి. మండే కూడా స్టడీగా వుంటే సినిమా పూర్తి విజ‌యం సాధించినట్లే.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి తొమ్మిది కోట్లకు కొన్నారు. ఫస్ట్ వీక్ లో హ్యాపీగా సేఫ్ అవుతారని డిస్ట్రిబ్యూషన్ వర్గాల బోగట్టా. ఇక ఓవర్ సీస్ ఒకటిన్నర కోటి ఇచ్చి కొన్నారు. అందులో యుఎస్..ఆస్ట్రేలియా వదిలేసి మిగిలినవి 40 లక్షలకు అమ్మేసారు. ఒక్క యుఎస్ లోనే మంచి లాభాలు కళ్ల చూసే అవకాశం వుంది.

మొత్తానికి సమంత హ్యాపీ..నిర్మాత హ్యాపీ.