బాలయ్య-స్టాపబుల్

అన్ స్టాపబుల్ సీజ‌న్ 2 తో తమ సంస్థకు మళ్లీ జీవం వస్తుందని ఆహా ఓటిటి ఆశ. తొలి ఎపిసోడ్ ను చంద్రబాబు నాయుడుతో ఓపెన్ చేసారు. మంచి బజ్ వస్తుందని అనుకున్నారు. బజ్…

అన్ స్టాపబుల్ సీజ‌న్ 2 తో తమ సంస్థకు మళ్లీ జీవం వస్తుందని ఆహా ఓటిటి ఆశ. తొలి ఎపిసోడ్ ను చంద్రబాబు నాయుడుతో ఓపెన్ చేసారు. మంచి బజ్ వస్తుందని అనుకున్నారు. బజ్ వచ్చింది. కానీ రావాల్సిన రేంజ్ సబ్ స్క్రిప్షన్లు రాలేదు. 

తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహంతో జ‌రిగిన సంగతి ఇది. కానీ ఆ తరువాత పవన్ కళ్యాణ్, రజ‌నీ కాంత్, కమల్ హాసన్ ఇలా చాలా మందిని అనుకున్నారు. ట్రయ్ చేసారు. కానీ పవన్ కళ్యాణ్ లాస్ట్ ఎపిసోడ్ కు ట్రయ్ చేస్తా అని వెయిటింగ్ లో పెట్టారు.

మొదట వారం వారం అనుకున్న ఎపిసోడ్ కాస్తా వారం విడిచి వారానికి మారింది. దీనికి కారణం గెస్ట్ లు దొరక్కపోవడమే. కొంతమంది బాలయ్య కు నప్పరు. కొంతమంది వస్తామన్నా లెవెల్ సరిపోదు. ఈ ఈక్వేషన్లు అన్నీ అలా వుంచితే బాలయ్య వీరసింహారెడ్డి షూట్ లో బిజీగా వున్నారు. ఆయనకు ఖాళీ వున్నపుడు షూటింగ్ పెట్టుకోవాలి ఆహా సంస్థ. కానీ ఆ టైమ్ లో గెస్ట్ లకు ఖాళీ వుండాలి. దీంతో ఎపిసోడ్ లు చేయడం కష్టం అయిపోతోంది.

ఇప్పటికే ఓ ఎపిసోడ్ ను వీరసింహారెడ్డి టీమ్ కోసం రిజ‌ర్వ్ చేసారు. శృతిహాసన్ ను ఆ ఎపిసోడ్ కు తీసుకువస్తారు. ఈ మధ్యలో ఫిల్లింగ్ కోసం సాయిధరమ్ తేజ్-వరుణ్ తేజ్ కాంబోను ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా అదే సమస్య. డేట్లు మ్యాచింగ్ కావాలి.

ముందుగా ఎవరి ఎపిసోడ్ వుంటుందన్నది క్లారిటీ లేదు. దాంతో సరైన ప్రోమో కట్..సరైన పబ్లిసిటీ పాజిబుల్ కావడం లేదు. విష్వక్ సేన్..సిద్దు జొన్నల గడ్డ దానికి సరైన రెస్పాన్స్ రాలేదు. శర్వానంద్ – అడవి శేష్ ఎపిసోడ్ బాగుంది అనిపించుకుంది. మొత్తానికి సీజ‌న్ వన్ కు వచ్చిన బజ్..సీజ‌న్ 2 విషయంలో కనిపించడం లేదు.