ఇంతకన్నా వైఎస్ కు ఏం కావాలి?

పుత్రోత్సాహము అన్నది పుత్రుడు పుట్టినపుడు కాదు. ఆ పుత్రుడు విజయాలు సాధించినపుడు అని అంటారు.  ఆ లెక్కన చూసుకుంటే, దివంగత నేత వైఎస్ కు కావాల్సినంత పుత్రోత్సాహం వచ్చి వుండాలేమో?  కొడుకు ఎదిగాడు. ముఖ్యమంత్రి…

పుత్రోత్సాహము అన్నది పుత్రుడు పుట్టినపుడు కాదు. ఆ పుత్రుడు విజయాలు సాధించినపుడు అని అంటారు.  ఆ లెక్కన చూసుకుంటే, దివంగత నేత వైఎస్ కు కావాల్సినంత పుత్రోత్సాహం వచ్చి వుండాలేమో?  కొడుకు ఎదిగాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. అది మాత్రం కాదు. తండ్రికి తన స్వంత స్థలంలో సమాధి మందిరం కట్టాడ. తండ్రి పేరు కలిసి వచ్చేలా పార్టీ పెట్టాడు. గెలిచి నిలిచాడు. తండ్రి పేరు వాడవాడలా వినిపించేలా పథకాలకు రూపకల్పన చేసారు.  వైఎస్ పేరు నిలబడేలా మాత్రమే కాదు, సంక్షేమ పథకాలు అమలు చేసి, జనం గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ పేరు పాడుచేయకుండా పాలన సాగిస్తున్నారు జగన్. ఇంతకన్నా పుత్రోత్సాహం ఏం కావాలి?

వాడవాడలా వైఎస్ జయంతి ఘనంగా జరిగింది. పార్టీ అధికారంలో వుంది కనుక, అందులో వింత ఏముంది అని అనేయచ్చు ఎవరైనా? కానీ తరచి చూస్తే అందులో తేడా కనిపిస్తుంది. మాజీ సిఎమ్ లు ఎవరికి గుర్తుంటారు. మహా అయితే ఎక్కడో ఓ ఫొటో, ఓ ఫంక్షన్, ఓ వార్త అంతే. అది కూడా కొద్ది మంది వరకే. చాలా మంది మాజీ సిఎమ్  లు జనాలకు గుర్తు లేరు కూాడా. కానీ వాడ వాడలా ఒక పండుగ మాదిరిగా వైఎస్ఆర్ పార్టీ జనాలు కార్యక్రమాలు నిర్వహించారు. 

ఎన్టీఆర్ కు కొడుకులు బోలెడు మంది వున్నారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ సంపాదించిన భూమలు బోలెడు వున్నాయి. ఒక్క స్వంత స్ధలంలో ఒక్క స్మారకమందిరాన్ని వారి కొడుకులు ఎవ్వరూ కట్టిన దాఖలా లేదు. ఎన్టీఆర్ సేకరించిన సినిమా సామగ్రి తో మ్యూజియం అన్నది ఎక్కడ వున్నదో తెలియదు. సమాధి ప్రభుత్వం కట్టింది. ప్రభుత్వ స్థలంలో. జయంతి ముందో వర్థంతి ముందో ప్రభుత్వం దాన్ని శుభ్రపరిచి, అలంకరించాల్సిందే. గతంలో ఇలా చేయలేదని ఎన్టీఆర్ కుటుంబీకులు ఆగ్రహించారు కూడా. కోట్ల ఆస్తులు ఇచ్చిన ఎన్టీఆర్ కోసం వేలు పెట్టి సమాధి అలంకరించడం కానీ, శుభ్రపర్చడం కానీ పిల్లలు చేయలేరా? అన్న కామెంట్లు వినిపించాయి.

జగన్ ఇప్పుడు అధికారంలో వున్నారు. ఆయన తలచుకుంటే ఆంధ్రలో ఎక్కడైనా వైఎస్ కు ఓ స్మారక చిహ్నం కట్టొచ్చు. కానీ అలాంటి ఆలోచన చేయడం లేదు. తమ స్వంత స్థలమైన ఇడుపులపాయలో తనే కట్టారు. వైఎస్ పేరు నిలబెట్టే పథకాలు ప్రవేశపెడుతున్నారు. అంతే తప్ప ప్రభుత్వ ధనం వాడి వైఎస్ కు పేరు తెచ్చే పని చేయలేదు. కేవలం మంచి పథకాలకు వైఎస్ పేర్లు పెట్టి, ఆయన పేరును నిలబెడుతున్నారు. 

ఓ కొడుకుగా చేయాల్సింది చేస్తున్నారు. వైఎస్ ఆత్మ ఎక్కడున్నా, ఇంతకన్నా ఏం కావాలి?

మోహన్ బాబు కూడా ఫోన్ చేశారు, కానీ నా దేవుడు చెయ్యలేదు

వైఎస్సార్ జయంతి వేడుకలు