జబర్దస్త్ లో జరిగిన చీలికపై ఆ కార్యక్రమానికి కీలక వ్యక్తిగా కొనసాగుతున్న హైపర్ ఆది స్పందించాడు. జబర్దస్త్ లో కొన్ని జరగకూడదని పరిణామాలు జరిగాయని, వాటి వల్లనే నాగబాబు ఆ షోను వదిలేశారని అంటున్నాడు హైపర్ ఆది.
“జబర్దస్త్ లో కొన్ని జరిగాయి. అవి పబ్లిక్ కు చెప్పేవి కావు. జబర్దస్త్ లో చీలిక రావడానికి ఆ పరిస్థితులే కారణం. మా అందరికీ ఎంతో ఇష్టమైన నాగబాబు లాంటి వ్యక్తి కూడా వెళ్లిపోయారు. ఛమక్ చంద్ర, ఆర్పీ కూడా అందుకే వెళ్లిపోయారు. ఆ పరిస్థితులేంటో నాకు తెలుసు. బయటకు మాత్రం చెప్పలేను.”
తను జబర్దస్త్ ను వీడి ఎందుకు నాగబాబు వెంట నడవలేదో కూడా కారణం చెప్పాడు హైపర్ ఆది. ఆ టైమ్ లో తనకు నాగబాబుకు మధ్య గ్యాప్ రాలేదంటున్నాడు ఈ కమెడియన్.
“నాగబాబు గారు వెళ్లిన ప్లేస్ లో కొంతమంది వ్యక్తుల గురించి నాకు కొన్ని నిజాలు తెలిశాయి. అందుకే ఆయనతో నేను నిలబడలేకపోయాను. నేను ఆ కార్యక్రమానికి (అదిరింది షో), కొంతమంది వ్యక్తులకు దూరం కానీ నాగబాబుకు దూరం కాదు. ఆయన నేను ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం.”
ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై హాస్యనటుడిగా కూడా రాణిస్తున్న హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ టైపులో హీరోగా మారే ఆలోచన తనకు లేదని స్పష్టంచేశాడు.