ఆమె లావు అయితే మీడియాకు ఎందుకంత బాధ!

అది అనుష్కా శెట్టి ఇష్టం.. లావుగా ఉంటుందా, డబుల్‌ చిన్‌ పెరిగిందా.. అనేది ఆమె చూసుకుంటుంది. ఒకవేళ ఏదైనా సినిమాలు ఆమె లుక్‌ మీకు ఎబ్బెట్టుగా అనిపిస్తే ఆ విషయాన్ని విశ్లేషించండి, అయితే సినిమా…

అది అనుష్కా శెట్టి ఇష్టం.. లావుగా ఉంటుందా, డబుల్‌ చిన్‌ పెరిగిందా.. అనేది ఆమె చూసుకుంటుంది. ఒకవేళ ఏదైనా సినిమాలు ఆమె లుక్‌ మీకు ఎబ్బెట్టుగా అనిపిస్తే ఆ విషయాన్ని విశ్లేషించండి, అయితే సినిమా స్క్రీన్‌ ఆవల, తన మానాన తను వెళ్తున్న ఆ నటీమణి ఇళ్లు చేసిందని, ఆమె లుక్‌ షాకింగ్‌ అని.. కొన్ని  మీడియా వర్గాలు ప్రత్యేక కథనాలే ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఆల్మోస్ట్‌ బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేశాయి మీడియా సంస్థలు.

అనుష్క వీళ్ల కంటికి ఇంపుగా ఉండాలి.. అనే తీరున కథనాలను రాశాయి అనేక మీడియా సంస్థలు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా 'షాకింగ్‌గా ఉన్న అనుష్క లుక్‌' అంటూ తోచిన వ్యాఖ్యానం చేశాయి. ఆమె ఎలా ఉంటే మీకెందుకు? అలా లావుగా మారిన ఆమె సినిమాలకు ఇక పనికి రాదన్నట్టుగా తీర్మానించేస్తూ రెచ్చిపోతున్నారు జర్నలిస్టులు. అది అనుష్క ఆమె నిర్మాతలు, దర్శకులు చూసుకుంటారు. వార్తా కథనాలు రాసే వాళ్లెవ్వరూ కూడా అనుష్క లుక్‌ మీద ఏమీ పెట్టుబడులు పెట్టడంలేదు కదా!

అనుష్క ఏ ఫొటో షూట్లో కూడా పాల్గొనలేదు. తన పని మీద తను ఎక్కడికో వెళ్తూ ఉందంతే. అలాంటి ఆమె ఫొటోలను తీసి తోచిన వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. తన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలనుకుంటే అలా ఉంచుకునే స్వాతంత్య్రం అనుష్కకు ఉంటుంది. ఆమె అందంగా కనిపించాలి, స్లిమ్‌గా ఉండాలి.. అని, ఇప్పుడు ఆమె అలా కనిపించడం లేదంటూ.. ఒకరకంగా ఆమెను హింసపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవేళ అనుష్క మీకు నచ్చని రూపంతో ఏదైనా సినిమాలో కనిపిస్తే అప్పుడు ఆ సినిమాను ఎవరైనా విశ్లేషించుకోవచ్చు.

ఆమె ఆ పాత్రకు సెట్‌ కాలేదనో.. అయ్యిందనో.. తోచిన వ్యాఖ్యానం చేసుకోవచ్చు. అంతేకానీ.. ఎంత ఆమె సినీ హీరోయిన్‌ అయినంత మాత్రానా ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం మంచిదికాదు. ఇలాంటి కామెంట్లతో సెలబ్రిటీల జీవితాలను ఉద్ధరించే ప్రయత్నం చేసే బదులు.. వ్యక్తులు ఎవరి జీవితాల గురించి, ఎవరి శరీరాల గురించి వాళ్లు ఆలోచించుకుంటే.. మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.

జగన్ 100 రోజుల పాలనపై 'గ్రేట్ ఆంధ్ర' పేపర్ ప్రత్యేక కథనం