‘చిరుత’కు కొత్త అర్థం చెప్పిన చరణ్

చిరుత.. రామ్ చరణ్ ను వెండితెరకు పరిచయం చేసిన సినిమా. ఇప్పటికీ రామ్ చరణ్ ను పొగడాల్సి వచ్చినప్పుడు చిరుత అని సంభోదిస్తుంటారు అతడి అభిమానులు. అయితే ఇప్పుడీ పదానికి కొత్త అర్థం ఇచ్చాడు…

చిరుత.. రామ్ చరణ్ ను వెండితెరకు పరిచయం చేసిన సినిమా. ఇప్పటికీ రామ్ చరణ్ ను పొగడాల్సి వచ్చినప్పుడు చిరుత అని సంభోదిస్తుంటారు అతడి అభిమానులు. అయితే ఇప్పుడీ పదానికి కొత్త అర్థం ఇచ్చాడు చరణ్. చిరుత అంటే 'చిరు తాత' అంటున్నాడు.

ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు చిరంజీవి. తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, చిరుత అనే పదప్రయోగం చేశాడు చరణ్. చిరుత అంటే 'చిరంజీవి తాత' అని అర్థం అంట.

రీసెంట్ గా చిరంజీవి తాత అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కూతురు పుట్టింది. మనవరాల్ని ఎత్తుకొని సంతోషంతో పొంగిపోతున్న చిరంజీవి ఫొటోను పోస్టు చేశాడు చరణ్. నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే, ఇలా చిరుత (చిరంజీవి తాత) అని సంబోధించాడు.

ప్రస్తుతం ఈ మెగా తండ్రికొడుకులిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు చరణ్. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇక చిరంజీవి కూడా పుట్టినరోజు సందర్భంగా 2 సినిమాలు ప్రకటించారు.