ఎదుటివాడిని తిడితే మనకు ప్రచారం వస్తుందనుకునే బాపతు జనాలు కొందరు వుంటారు. ఈ పద్దతిని సినిమా ప్రచారానికి కూడా వాడుకోవాలనుకున్నట్లున్నారు. ఉండిపోరాదే అనే ఓ చిన్న సినిమా ప్రమోషన్ కోసం సాహో సినిమా రివ్యూ అంటూ యూట్యూబ్ లో వీడియో చేసి వదిలారు. ఆ వీడియోలో నటించిన అమ్మాయి క్యారెక్టర్ చేత బూతులు యథేచ్ఛగా మాట్లాడించేసారు. సాహో సినిమాను సమీక్ష చేయడం అలావుంచి డైరక్టర్ సుజిత్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ లు చేసారు.
ఆ కామెంట్లలో కూడా అసభ్యపదాలు వాడేసారు. పనిలో పనిగా తమ సినిమా గొప్పగా అద్భుతంగా వుంటుందని చెప్పుకువచ్చారు. తమ సినిమా ప్రచారం చేసుకోవచ్చుకానీ, ఎదుటి సినిమాను కామెంట్ కూడా చేయవచ్చు. కానీ ఇలా అసభ్యపదజాలం వాడడం అన్నది ఎంత వరకు సబబు? ప్రచార వీడియోనే ఇంత భయంకరంగా చేసిన వారు సినిమాను ఇంకెలా తీసివుంటారో?
ఆఖరికి రాను రాను బూతు పదాలు కామన్ ప్రచారమాధ్యమంగా మార్చేస్తారేమో? ఇలాంటి మేధావులు అంతాకలిసి. చిన్న సినిమాను పైకి లేపడం కోసం మరీ ఇంత దిగజారుడు అవసరమా?