cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీమామకు సరైన డేట్

వెంకీమామకు సరైన డేట్

దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వీళ్లు సినిమాలకు భలే డేట్ లు సెట్ చేసుకుంటారు. ఆ ప్లానింగ్ నే వేరు. సరైన పోటీలేకుండా, సెలవులు కలిసి వచ్చేలా డేట్ ను ఫిక్స్ చేస్తారు. దాంతో సినిమాకు మినిమమ్ గ్యారంటీ వస్తుంది. ప్రస్తుతం సురేష్ బాబు, పీపుల్స్ మీడియా కలిసి వెంకీమామ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 4న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ సైరా ఎఫెక్ట్ ఎలా వుంటుందో తెలియదు. అందుకే వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మాంచి డేట్ పట్టేసారు.

దీపావళికి సినిమా వస్తే శని, ఆదివారాలు, ఆ పక్కన దీపావళి, అదేవారంలో నాగులచవితి కలిసివస్తాయి. వారంలో నాలుగు రోజులు కనీసం సెలవులు అన్నమాట. వెంకీ మామ సినిమాకు కాస్త ఎక్కువే ఖర్చు చేసారు. సినిమాకు లోకేషన్లు, సెట్లు, యాక్షన్ సీన్లు ఎక్కువ వుండడంతో యాభై కోట్ల వరకు ఖర్చయింది.

నాన్ థియేటర్ హక్కుల సంగతి ఎలావున్నా, మంచి రెవెన్యూ రావాలి అంటే ఇలాంటి డేట్ అవసరం. పైగా ఈ డేట్ కు పోటీ వచ్చే సినిమా ఏదీ కనుచూపు మేరలోలేదు. అందువల్ల వెంకీమామ రిలీజ్ ప్లాన్ అయితే అదిరింది. ఇక సినిమాను బట్టి ఫలితం. ఈ సినిమాకు బాబీ దర్శకుడు.

ఈ హీరో ఆఫీస్ చూసారా? అదుర్స్ కదా..?