Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మూడింట ఓ థియేటర్ మూత

మూడింట ఓ థియేటర్ మూత

సూళ్లూరుపేట లాంటి చిన్న ప్రాంతంలో భారీ మల్టీఫ్లెక్స్ ను నిర్మించింది వి -సెల్యులాయిడ్ సంస్థ వి-ఎపిక్ అంటూ పేరు పెట్టిన ఈ కాంప్లెక్స్ లో అంత్యంత భారీ ఐమాక్స్ తెర లాంటిది ఏర్పాటు చేసారు. ఇలాంటిది ఇండియాలోనే లేదు. ఇక ఇదికాక రెండు మినీ థియేటర్లు నిర్మించారు.

నెల్లూరు-తిరుపతి హైవే మీద వున్న ఈ థియేటర్లు ఫుల్ గా బిజినెస్ అందుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. సాహో సినిమాతో ఈ మూడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి. సాహో ఫుల్ స్వింగ్ లో వున్నన్నాళ్లు బాగానే వుంది. కానీ కాస్త డౌన్ అవగానే ఓ థియేటర్ ను ఆపేయాల్సి వచ్చింది.

వాస్తవానికి తెలుగునాట థియేటర్లలో షోలు క్యాన్సిల్ చేయడం అన్నది ఇటీవల కామన్ అయిపోయింది. సరైన సినిమాలు పడడంలేదు. కొన్నిసార్లు అరడజను టికెట్ లు కూడా తెగడంలేదు. అలాంటపుడు షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. సూళ్లూరు పేటలో నిర్మించిన వి ఎపిక్ మల్టీఫ్లెక్స్ కాబట్టి, బిగ్ స్క్రీన్, స్మాల్ థియేటర్ వుంచి, రెండో స్మాల్ థియేటర్ ను ప్రస్తుతానికి క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

మళ్లీ సైరా లాంటి పెద్ద సినిమా పడితే ఓపెన్ చేసుకోవచ్చు. లేదా గ్యాంగ్ లీడర్ లాంటి రిలీజ్ లు వున్నా ఓపెన్ చేసుకోవచ్చు. లేదూ అంటే ఇలా క్లోజ్ చేసుకుని ఖర్చులు సేవ్ చేసుకోవడమే.

ఈ హీరో ఆఫీస్ చూసారా? అదుర్స్ కదా..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?