గ్యాంగ్ లీడర్ మోస్ట్ ఎంటర్ టైనింగ్-నాని

హీరో నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీమేకర్స్‌ పతాకంపై నిర్మించిన సినిమా 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు.…

హీరో నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీమేకర్స్‌ పతాకంపై నిర్మించిన సినిమా 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవి.

గ్యాంగ్‌ లీడర్‌ కు శ్రీకారం
విక్రమ్‌ నేను చాలా రోజులుగా రకరకాల ఐడియాస్‌ అనుకున్నాం. అలా ఒక రోజు ఈ ఐడియా గురించి చెప్పడం జరిగింది. నాకు బాగా నచ్చడంతో ఇమ్మిడియట్‌గా ఓకే చెప్పాను. అప్పటికి నేను 'జెర్సీ' షూటింగ్‌ స్టార్ట్‌ చేశాను. ఆ సినిమా షూటింగ్‌ అయిపోయేలోపు కథను ఇంకా డెవలప్‌ చేయమని చెప్పాను. అలా 'జెర్సీ' తరువాత వెంటనే 'గ్యాంగ్‌ లీడర్‌' స్టార్ట్‌ అయింది.

విక్రమ్ స్క్రీన్ ప్లే
నాకు తెలిసి విక్రమ్‌ అన్ని సినిమాల్లో లెస్‌ కాంప్లికేటెడ్‌ మూవీ ఇదే అని చెప్పొచ్చు. ట్విస్ట్‌లు టర్న్‌లు ఉన్నాసరే అవి అంత కాంప్లికేటెడ్‌ విషయాలు కావు. అలాగే విక్రమ్‌ అన్ని సినిమాల్లో మోస్ట్‌ ఎంటర్టైనింగ్‌ ఫిలిం కూడా ఇదే.

సినిమాలో క్యారెక్టర్
ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు పెన్సిల్‌ పార్థసారథి. పెన్సిల్‌ అనేది నా పెన్‌ నేమ్‌. చాలా పుస్తకాలు రాసిన అవి సేల్‌ అవ్వవు. అయినా చాలా పెద్ద రైటర్‌ అనేది వాడి ఫీలింగ్‌. ట్రైలర్‌లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ కామెడీ ఉంటుంది.

సినిమాలో ఎగ్జైటెడ్‌ అంశాలు
దాదాపుగా చాలా సినిమాల్లో చూసుకుంటే రివెంజ్‌ అనే కాన్సెప్ట్‌ చాలా వయిలెంట్ గా ఉంటుంది. పెద్ద పెద్ద డైలాగ్స్‌, ఫైట్స్‌ ఉంటాయి. అయితే రివెంజ్‌ అనే కాన్సెప్ట్‌ని ఎంటర్టైనింగ్‌ వేలో చూపిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్‌ నన్ను బాగా ఎగ్జైట్‌ చేసింది. అయిదుగురు ఆడవాళ్ల రివెంజ్ అన్నది వాళ్లకు నా పాత్ర లీడింగ్ అన్నది కూడా ఎగ్జయిటింగ్ గా వుంటుంది.

ప్రొడక్షన్‌ వాల్యూస్‌
మైత్రిమూవీస్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ గురించి అందరికి తెలుసు. వారు ఎన్నో మంచి చిత్రాలని నిర్మించారు. ఈ సినిమా విషయంలో కూడా బడ్జెట్‌కి ఎక్కడాకాంప్రమైజ్‌ కాకుండా బెస్ట్‌ అవుట్‌ ఫుట్‌ రావడానికి ఎంతో సహకరించారు.

సీనియర్ హీరోయిన్ లక్ష్మి?
సినిమాలో సీనియర్ హీరోయిన్లు లక్ష్మీ, శరణ్య అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్‌ చేస్తారు. కొన్ని సీన్స్‌లో నా కామెడీ టైమింగ్‌కి వాళ్ళ కామెడీ టైమింగ్‌కి భలే సింక్‌ అయ్యింది. నిజానికి వాళ్ళే సినిమాకు బలం.

కార్తికేయ నెగటివ్‌ రోల్‌?
సినిమాలో కార్తికేయ చేసిన క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. విక్రమ్‌ వెళ్లి కథ చెప్పినప్పుడు తను చేస్తాడా లేదా అనుకున్నాను. ఒకే అన్నాడు అనగానే హ్యాపీగా ఫీలయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్‌ రోల్‌ అది. సినిమా రిలీజ్‌ తరువాత కచ్చితంగా ఆ క్యారెక్టర్‌ గురించి మాట్లాడతారు.

అనిరుద్‌ మ్యూజిక్‌?
అనిరుద్‌ మ్యూజిక్‌ లో ఒక ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ సినిమా కోసం తనని తీసుకున్నాం. పైగా విక్రం కూడా అనిరుద్‌ తో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో అనుకుంటున్నాడట. 'జెర్సీ' కి అనిరుద్‌ కరక్టేనా అని చాలా ఆలోచించాం కానీ ఈ సినిమాకు పెద్దగా డిస్కస్‌ చేయకుండానే పర్ఫెక్ట్‌ అనిపించి ఫైనల్‌ చేసేసాం.

బహుభాషా సినిమాలు
ఇంతకు ముందు నేను బహుభాషా చిత్రాలు చేయడానికి ట్రై చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసు. అందుకే నాకు అవి అంటే భయం. అదిరిపోయే స్క్రిప్ట్‌తో మంచి సెటప్‌ కుదిరి అలాగే రెండు రాష్ట్రాలకు బాగుంటుంది. అందరికీ నచ్చే ఎలిమెంట్స్‌ ఉన్నాయి అంటేనే పలు భాషల సినిమా చేస్తాను. అంతే కాని ఇంకో చోట కూడా కలెక్షన్స్‌ వస్తాయి కదా అని చేయడం కరెక్ట్‌ కాదని నా ఫీలింగ్‌.

11ఏళ్ల అనుభవం
11ఏళ్ల సమయం ఎప్పుడైందో కూడా తెలియనంతగా కాలం గడిచిపోయింది. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా  కృతఙ్ఞతలు తెలియజేస్తున్నా.

ఈ హీరో ఆఫీస్ చూసారా? అదుర్స్ కదా..?