ఆయన పేరుకు ముందు విజయం ఉంది. ఆయన మేధస్సు ఏంటో ట్వీట్ చెబుతుంది. బాబు మీద పంచ్ లేయాలంటే ఆయనే సరిసాటి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ రెడ్డిగా మారిపోయారు. ఆయన అక్కడ అయిదేళ్ళుగా మకాం ఉంటూ పార్టీ విజయసారధిగా మారారు.
మరో మారు జగన్ ఆయనకే ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల పార్టీ పగ్గాలను అప్పగించారు. ఇక ఈ కొత్త బాధ్యతల తరువాత విజయసాయిరెడ్డి విశాఖ వస్తే ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతమే పలికాయి.
ఇక సాయిరెడ్డికి ఎన్నో బిరుదులు కూడా ఇచ్చేస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్రా రాజకీయ గురువు అని, అపర చాణక్యుడని వేణ్ణోళ్ళ వైసీపీ నేతలు పొగుడుతున్నారు. ఆయనతోనే విశాఖ అభివ్రుధ్ధి సాధ్యమని కూడా ప్రస్తుతిస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉన్నా విజయసాయిరెడ్డి ఉరవ్ ఉత్తరాంధ్రా చాణక్య అన్న బిరుదు మాత్రం భలేగా ఉందంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో టీడీపీ కంచుకోటలను మంచుకోటలుగా మార్చేసిన ఘన విజయంలో సాయిరెడ్డి వ్యూహాలను కూడా తక్కువ చేయలేమని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డిని విశాఖ గడప దాటించాలనుకున్న శక్తులకు మాత్రం ఆయన మరింత బలోపేతమైపోతూండడం షాక్ ఇచ్చే పరిణామమేనని అంటున్నారు.