స్టార్ ల పుత్రిక అయినప్పటికీ.. మనీ మేనేజ్ మెంట్ లో చిన్న వయసులోనే పెద్ద పాఠాలను ఒంటబట్టించుకున్నట్టుగా ఉంది జాన్వీ కపూర్. తండ్రి స్టార్ ప్రొడ్యూసర్, దివంగతురాలైన ఆమె తల్లి ఎంతటి స్టారో వేరే చెప్పనక్కర్లేదు. అయితే మనీ మేనేజ్ మెంట్లో బోనీ కపూర్ ఫ్యామిలీ బాగా ఇబ్బందులు పడింది. ఒక దశలో బోనీ కపూర్ దివాళా తీసినట్టుగా వార్తలు వచ్చాయి.
సినిమాల వరస ఫెయిల్యూర్ల మధ్యన బోనీ కపూర్ ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారనే టాక్ వచ్చేదప్పట్లో. అయితే ఆ తర్వాత ఆయన మళ్లీ సినిమాలతోనే నిలదొక్కుకున్నారు. 'నో ఎంట్రీ' సినిమాతో బోనీ కపూర్ కు మళ్లీ డబ్బులొచ్చాయి. బాలీవుడ్ లో మెయిన్ స్ట్రీమ్ లో బూతు సినిమాల సంస్కృతికి స్వాగతం పలికిన సినిమాగా బోనీ కపూర్ నిర్మించిన ఆ సినిమా కు పేరుంది. ఆ సినిమా తెలుగులో కూడా తీశారు. *పెళ్లాం ఊరెళ్తే* పేరుతో తెలుగులో క్లీన్ కామెడీ అది. వీటన్నింటికీ మూలం ఒక మలయాళం సినిమా. దాన్ని బాలీవుడ్ లో బూతు ధోరణిలో తీసి హిట్ కొట్టారు బోనీ కపూర్. అక్కడ నుంచి ఆయన టైమ్ మళ్లీ మొదలైంది.
ఇక శ్రీదేవి మరణం సమయంలో కూడా ఆర్థిక కోణాలు చర్చకు వచ్చాయి. శ్రీదేవి డబ్బుతో బోనీ కపూర్ తన కొడుకును హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్నారనే టాక్ వచ్చిందప్పట్లో. అయితే ఆ వాదనలేవీ నిలబడలేదు. మరి తల్లిదండ్రులు మనీ మేనేజ్ మెంట్లో కాస్త పూర్ అనే టాక్ ఉన్న నేపథ్యంలో జాన్వీ మాత్రం ఇప్పటికే మంచి పెట్టుబడిదారు అయ్యింది.
ఆ మధ్య ఏకంగా నలభై కోట్ల రూపాయలకు పై విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేసింది జాన్వీ కపూర్. మరి ఆమె బాలీవుడ్ లో ఇప్పటి వరకూ చేసిన సినిమాలను బట్టి చూస్తే అంత ఆస్తి సొంతంగా కొనుగోలు చేయడం మాటలేమీ కాదు. మరి ఇందుకు సంబంధించి సీక్రెట్ ఏమిటో జాన్వీ చెప్పకనే చెప్పింది.
తన సోషల్ మీడియా ప్రమోషన్లు, యాడ్స్ ద్వారా వచ్చే డబ్బుతో ఈఎంఐలు కడుతున్నట్టుగా జాన్వీ వివరించింది. బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల కు భారీగా డబ్బులు వస్తాయనే సంగతి తెలిసిందే. ఆ పోస్టుల్లో ఏదో ఒక బ్రాండ్ ప్రమోషన్ పెట్టుకుంటారు. ఇలా వారికి భారీ ఎత్తున డబ్బులు వస్తున్నాయి. ఇలా వచ్చే డబ్బును జాన్వీ తన ఈఎంఐల చెల్లింపులకు వెచ్చిస్తోందట! మరి ఈ హీరోనో ప్రేమించి, అతడిని తన వాడు అనుకుని డబ్బులు ధారపోసే హీరోయిన్లతో పోలిస్తే జాన్వీ కి మనీ మేనేజ్ మెంట్లో మంచి టాలెంట్ ఉన్నట్టుంది!