మళ్లీ మరోసారి కన్యాశుల్కం

గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం అజరామరం. వంద ఏళ్లు దాటినా ఇప్పటికి నవ్యనూతనంగా ఎక్కడో ఒక చోట ప్రదర్శితమవుతున్న నాటకం అది.  Advertisement ఇప్పటికే ఒకటి రెండు సార్లు వెండితెర మీదకు వచ్చింది…

గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం అజరామరం. వంద ఏళ్లు దాటినా ఇప్పటికి నవ్యనూతనంగా ఎక్కడో ఒక చోట ప్రదర్శితమవుతున్న నాటకం అది. 

ఇప్పటికే ఒకటి రెండు సార్లు వెండితెర మీదకు వచ్చింది కూడా. గిరీశం..మధురవాణి, కరకటశాస్త్రి..మధురవాణి ఇలా ప్రతి పాత్ర నటీనటులకు సవాల్ లాంటిది. అందుకే ఆ పాత్రలో పోషించాలని అనుకుంటూనే వుంటారు.

ఇప్పుడు అదే కన్యాశుల్కం నాటకాన్ని మరోసారి సినిమాగా మార్చే ప్రయత్నం ప్రారంభమైంది. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈసారి ఈ ప్రయత్నాన్ని తలెకెత్తుకోవడమే కాకుండా గిరీశం పాత్రను పోషిస్తున్నారు. గతంలో సావిత్రం మధురవాణి పాత్రను పోషించి శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని హీరోయిన్ అంజలి చేయబోతోంది.

సాయికుమార్, ఇంకా పలువురు సీనియర్ నటులు కన్యాశుల్కం పాత్రలను మరోసారి కళ్ల ముందుకు తీసుకురాబోతున్నారు.